శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 11:58:22

ప్రధాని పర్యటన.. రాజీవ్‌ రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు

ప్రధాని పర్యటన.. రాజీవ్‌ రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాజీవ్‌ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకుంటారు. అటునుంచి శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని జీనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌కు‌ వెళ్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని కాన్వాయ్‌ వెళ్లే సమయంలో భద్రత దృష్ట్యా రాజీవ్‌ రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌-కరీంనగర్‌ మార్గంలో వాహనదారులు సహకరించాలని కోరారు. 

గుజరాత్‌లోని బైడస్‌ క్యాడిలా సంస్థను ప్రధాని సందర్శించారు. క్యాడిలా సంస్థ తయారు చేస్తున్న ‘జైకోవ్‌-డీ’ కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీకి సంబంధిన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉన్న జైకోవ్‌-డీ వ్యాక్సిన్‌ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహారాష్ట్రలోని పుణెలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అటునుంచి హైదరాబాద్‌కు పయణమవుతారు.    


logo