ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 07:30:05

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ :  గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్‌ పోలీసులు వెల్లడించారు.  పబ్లిక్‌గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని, వాహనదారులు సహకరించాలని కోరారు. మొజంజాహి మార్కెట్‌ తాజ్‌ ఐల్యాండ్‌, చాపెల్‌ రోడ్డు టీ జంక్షన్‌, సైఫాబాద్‌ పాత పీఎస్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మీనార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, ఆదర్శ్‌నగర్ ‌(న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌) వద్ద ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. సూచించిన మార్గాల్లో ప్రయాణించి వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo