e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News బోనాలు.. న‌గ‌రంలో ఆది, సోమ‌వారాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

బోనాలు.. న‌గ‌రంలో ఆది, సోమ‌వారాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఆదివారం, సోమ‌వారం ఆల‌య‌ ప‌రిస‌ర ప్రాంతాల్లో హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్ష‌లు విధించారు. జూలై 25న తెల్లవారుజామున 4 గంట‌ల‌ నుండి పూజ ముగిసే వరకు పొగాకు బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారిలో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు. బాటా క్రాస్ రోడ్ నుండి ప్రారంభ‌మ‌య్యే సుభాష్ రోడ్ నుండి రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వరకు హ‌వానాల రాక‌పోక‌ల‌ను నిషేధించారు. అదేవిధంగా అద‌వయ్య క్రాస్ రోడ్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్ళే రహదారి, జనరల్ బజార్ నుండి ఆలయానికి వెళ్ళే రహదారిలో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

రాణీగంజ్ :

- Advertisement -

క‌ర్బాలా మైదాన్ నుండి వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సులు, వాహ‌నాల‌ను రాణీగంజ్ క్రాస్ రోడ్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి మినిస్ట‌ర్ రోడ్ – ర‌సూల్‌పూరా క్రాస్ రోడ్స్ – సీటీవో – ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్స్ – వైఎంసీఏ క్రాస్ రోడ్స్‌- సెయింట్ జాన్స్ రోట‌రీ – గోపాల‌పురం లేన్ – రైల్వే స్టేష‌న్ వైపున‌కు పంపించ‌నున్నారు.

గ‌మ‌నిక : రైల్వే స్టేష‌న్ నుండి ట్యాంక్‌బండ్ వైపున‌కు తిరిగివ‌చ్చే ఆర్టీసీ బ‌స్సులు ఆల్ఫా హోట‌ల్ క్రాస్ రోడ్ గుండా – గాంధీ హాస్పిట‌ల్ క్రాస్ రోడ్స్ – స‌జ్జ‌న్‌లాల్ స్ట్రీట్ – ఘాష్‌మండి – బైబిల్ హౌస్ – క‌ర్బాలా మైదాన్ మీదుగా ప్ర‌యాణం. రైల్వే స్టేష‌న్ నుండి తాడ్‌బండ్‌, బేగంపేట వైపు తిరిగివ‌చ్చే బ‌స్సుల‌ను క్లాక్ ట‌వ‌ర్ – ప్యాట్నీ క్రాస్ రోడ్స్ – వైఎంసీఏ క్రాస్ రోడ్ – ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్స్ మీదుగా ప్ర‌యాణం.

ఘన్స్‌మండి ఎక్స్ రోడ్స్ :

బైబిల్ హౌస్ నుండి వ‌చ్చే ట్రాఫిక్‌ను ఘాస్‌మండి ఎక్స్ రోడ్స్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి స‌జ్జ‌న్‌లాల్ స్ట్రీట్‌, హిల్ స్ట్రీట్ వైపున‌కు

ప్యాట్నీ ఎక్స్ రోడ్స్ :

ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్స్ నుండి ఆర్‌.పీ.రోడ్ వైపున‌కు వచ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి క్లాక్ ట‌వ‌ర్‌, ప్యార‌డైస్‌ వైపుగా అలాగే ప్యార‌డైస్ నుండి ఆర్‌.పి.రోడ్ వైపుగా వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి ఎస్‌బీహెచ్ లేదా క్లాక్ ట‌వ‌ర్ వైపున‌కు మ‌ళ్లింపు. అదేవిధంగా క్లాక్ ట‌వ‌ర్ నుండి ఆర్‌.పి.రోడ్ వైపున‌కు వ‌చ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్స్‌, ప్యార‌డైస్ వైపున‌కు మ‌ళ్లింపు.

ప్యార‌డైస్ క్రాస్ రోడ్స్ :

సీటీవో జంక్ష‌న్ నుండి ఎం.జీ.రోడ్ వైపున‌కు వ‌చ్చే ట్రాఫిక్‌ను ప్యార‌డైస్ క్రాస్ రోడ్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – సింధి కాల‌నీ – మినిస్ట‌ర్ రోడ్ – రాణిగంజ్ క్రాస్ రోడ్స్ – క‌ర్బాలా మైదాన్ వైపుగా. ప్యాట్నీ క్రాస్ రోడ్స్ నుండి వ‌చ్చే ట్రాఫిక్‌ను ప్యార‌డైస్ క్రాస్ రోడ్స్ వ‌ద్ద మ‌ళ్లింపు చేప‌ట్టి సీటీవో జంక్ష‌న్ వైపున‌కు మ‌ళ్లించ‌నున్నారు.

జూలై 26న మధ్యాహ్నం 2 గంట‌ల‌ నుండి 10 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సెయింట్ మేరీస్ రోడ్ వైపు ఉన్న రహదారి మూసివేయ‌నున్నారు.

హకీంపేట, బోయిన‌ప‌ల్లి, బాలానగర్, అమీర్‌పేట నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లే అన్ని బస్సులు క్లాక్ టవర్ వద్దే నిలిపివేయబడతాయి. తిరిగి ఇదే మార్గంలో పాట్నీ, ఎస్‌బీహెచ్ క్రాస్ రోడ్ మీదుగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి.

పార్కింగ్ ప్ర‌దేశాలు :

  1. సెయింట్ జాన్ రోటరీ, స్వీకర్ ఉప్‌కార్‌, ఎస్‌బీహెచ్ నుండి వ‌చ్చే వాహ‌న‌దారులు తమ వాహనాలను హరి హరా క‌ళాభ‌వ‌న్ లేదా మహబూబియా కాలేజీలో పార్క్ చేయాలి
  2. కర్బాలా మైదాన్‌, బైబిల్ హౌస్, ఘన్స్‌మండి నుండి వ‌చ్చే వాహనాలు ఇస్లామియా హైస్కూల్‌లో పార్క్ చేయాలి
  3. రాణిగంజ్, అడయ్య ఎక్స్ రోడ్ల నుండి వచ్చే వాహనాలు అడ‌య్య ఎక్స్ రోడ్ వ‌ద్ద గ‌ల ప్రభుత్వ అడ‌య్య మెమోరియ‌ల్ హై స్కూల్‌లో పార్క్ చేయాలి
  4. సుభాష్ రోడ్ నుండి వచ్చే వాహనదారులు తమ వాహనాలను ఓల్డ్ జైలు ఖానా బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయాలి అదేవిధంగా మంజు థియేటర్ నుండి వచ్చే వాహనాలు అంజలి థియేటర్ లేన్ వద్ద పార్క్ చేయాల్సిందిగా సూచించారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana