హైదరాబాద్: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గన్‌పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. ఈనేపథ్యంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డు, వీవీ విగ్రహం, ఖైరతాబాద్, నిరంకారి, పాత సైఫాబాద్ పీఎస్, రవీంద్రభారతి జంక్షన్, బషీర్‌బాగ్ జంక్షన్, ఏఆర్ పెట్రోల్ బంక్, నాంపల్లి రోడ్డు, తాజ్ ఐలాండ్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.