బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 01, 2020 , 19:50:57

రేపు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్:  జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని..రేపు ఉదయం 8.30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు రాజ్ భవన్ రోడ్, నిరంకారి భవన్, ఖైరతాబాద్, వీవీ స్టాచ్యూ, ఓల్డ్ సైఫాబాద్, రవీంద్రభారతి జంక్షన్, నాంపల్లి ఏఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నిలివేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. 
logo