శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 06:26:41

పంజాగుట్ట వద్ద భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు

పంజాగుట్ట వద్ద భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు

హైదరాబాద్ : పంజాగుట్ట శ్మశాన వాటికి వద్ద రోడ్డు నిర్మాణం, స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 14వ తేదీ నుంచి భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ ఆంక్షలు జూన్‌ 3వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు. ఫిలింనగర్‌, రోడ్డు నం.45, రోడ్డు నం.36 జంక్షన్ల నుంచి వచ్చే భారీ వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, వెంకటగిరి, కృష్ణానగర్‌, యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు, యూసుఫ్‌గూడ బస్తీ, మైత్రివనం, అమీర్‌పేట్‌ మీదుగా గానీ, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రోడ్డు నం. 45, జూబ్లీహిల్స్‌, బీవీబీ జంక్షన్‌, ఒరిస్సా ఐలాండ్‌, రోడ్డు నం.12, బంజారాహిల్స్‌ రోడ్డు నం.1 మీదుగా గానీ వెళ్లాలని సూచించారు.


logo