సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 09:33:13

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్

హైదరాబాద్‌ : భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. శివారులోని దండుమల్కాపురం నుంచి ఇనాంగూడ వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు ముందులు కదిలే పరిస్థితి లేకుండాపోయింది. వందలాది వాహనాలు రహదారిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పొలీసులు అన్నిచర్యలు తీసుకుంటున్నారు.  అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాహనదారులు ప్రమాదాల బారినపడకుండా అప్రమత్తం చేస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo