ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 09:22:40

హైద‌రాబాద్‌లో జ‌నాభా‌తోపాటు పెరుగుతున్న ట్రాఫిక్

హైద‌రాబాద్‌లో జ‌నాభా‌తోపాటు పెరుగుతున్న ట్రాఫిక్

హైద‌రాబాద్‌: రాజ‌ధాని హైద‌రాబాద్‌లో రోజురోజుకు జ‌నాభాతోపాటు ట్రాఫిక్ కూడా పెరుగుతున్న‌ద‌ని‌ ‌హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ అన్నారు. దేశంలో హైద‌రాబాద్ పోలీసుల‌కు మంచిపేరున్న‌ద‌ని చెప్పారు. ర‌హ‌దారి భ‌ద్రత‌‌పై ట్రాఫిక్ పోలీసులు నెక్లెస్‌రోడ్‌లో నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ ర‌న్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీ అంజ‌నీకుమార్‌, 50 పోలీస్‌స్టేష‌న్ల సిబ్బంది పాల్గొన్నారు.

ట్రాఫిక్ పోలీసులు రాత్రి ప‌గ‌లు క‌ష్ట‌ప‌డి విధులు నిర్వ‌హిస్తున్నార‌ని మంత్రి ప్ర‌శంసించారు. అందువ‌ల్ల మ‌నం ట్రాఫిక్ పోలీసుల‌ను గౌర‌వించుకోవాల‌ని చెప్పారు. త‌ల్లిదండ్రులు చిన్న‌పిల్ల‌ల‌కు వాహ‌నాలు ఇవ్వొద్ద‌ని సూచించారు. గ‌త నాలుగేండ్ల‌లో రోడ్డు ప్ర‌మాదాలు 40 శాతం త‌గ్గాయ‌ని సీపీ అంజ‌నీకుమార్ చెప్పారు. ప్ర‌తిఒక్క‌రు త‌ప్ప‌కుండా ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.