గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 12:32:19

హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు

హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వాన బీభ‌త్సం సృష్టించింది. దీంతో ప‌లు రోడ్లు దెబ్బ‌తిన్నాయి. కొన్ని చోట్ల ర‌హ‌దారుల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచింది. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ పోలీసులు వాహ‌నాల‌ను మ‌ళ్లీస్తున్నారు. ప‌లు చోట్ల ఆంక్ష‌లు విధించారు. హైదరాబాద్‌-కర్నూలు హైవే తెగడంతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేవారు.. ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌకి ప్లైఓవర్ వాడొద్దని చెప్పారు. దీనికి బదులు సెవెన్‌ టోంబ్స్‌ నుంచి వెళ్లాలని ప్రయాణీకులను పోలీసులు కోరారు. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డును పూర్తిగా మూసి వేశారు. ఇక్కడి నుంచే వెళ్లే వాహనాలను కార్వాన్‌ నుంచి మళ్లిస్తున్నారు.

మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ అయ్యింది. దీంతో ఈ మార్గాన వచ్చే వాహనాలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. మూసీ ఉప్పొంగడంతో మూసారాం బాగ్ బ్రిడ్డి దగ్గర ట్రాఫిక్ బ్లాక్‌ అయ్యింది. ఇటు వైపు రావొద్దని పోలీసులు వాహనదారులకు సూచించారు. మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు.

వీడియోల కోసం క్లిక్‌  చేయండి.. 

హైదరాబాద్‌లో పరవళ్లు తొక్కుతున్న మూసీ..

చరిత్రలో ఎన్నడూ లేనంతగా మూసీకి వరద..

హుస్సేన్ సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద.


logo