సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 21:18:57

యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు

యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి మంగళవారం సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించారు. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో శ్రీలక్ష్మీనరసింహుల నిత్యకళ్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామి అమ్మవారుల ఆశీస్సులు అందజేశారు.

ఇవి కూడా చదవండి..

బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

శభాష్‌ టీమిండియా : మంత్రి హరీశ్‌ రావు 

ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు

సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి 

అత్య‌ద్భుత సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌టి: స‌చిన్‌ 

టీమిండియాకు 5 కోట్ల బోన‌స్

టీమిండియా విజ‌యంపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

రిష‌బ్ పంత్ సూప‌ర్ షో.. క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ 

VIDEOS

logo