గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 17:57:26

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కార్మిక సంఘాల మ‌ద్ద‌తు‌

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కార్మిక సంఘాల మ‌ద్ద‌తు‌

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కార్మిక సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తును ప్ర‌క‌టించాయి. సార్వ‌త్రిక స‌మ్మె నేప‌థ్యంలో బీఎస్ఎన్ఎల్‌, ఎల్ఐసీ ఉద్యోగులు నేడు స‌మావేశమ‌య్యారు. భేటీ అనంత‌రం కార్మిక సంఘాలు టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తినిస్తూ తీర్మానం చేశాయి. సార్వ‌త్రిక సమ్మె జయప్రదం చేయాలని చేప‌ట్టిన ప్రచారంలో భాగంగా సంచార్ భవన్, తెలంగాణ సర్కిల్ ఆఫీస్ ముందు భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్‌ను ఉద్దేశించి టీఆర్ఎస్ నాయ‌కులు, రాష్ర్ట ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బి. వినోద్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 26న కార్మిక సంఘాలు నిర్వ‌హించే దేశ‌వ్యాప్త సార్వ‌త్రిక స‌మ్మెకు త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుందని  తెలిపారు.

మోడీ ప్రభుత్వ హాయాంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దేశానికి వెన్నెముఖ అయిన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీఎస్ఎన్ఎల్‌కు 4జీ సర్వీసులను ప్రారంబించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ స‌మావేశంలో జూలపల్లి సంపత్ రావు, బీఎస్ఎన్ఎల్‌ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఏ.రాజమౌళి, ఎన్ఎఫ్టీఈ రాష్ట్ర కార్యదర్శి జి.సాంబశివరావు, బీఎస్ఎన్ఎల్ రాష్ట్ర కార్యదర్శి, త‌దిత‌రులు పాల్గొన్నారు.