శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 14:11:16

నాగార్జునసాగర్‌లో పర్యాటక లాంచీల విహారం ప్రారంభం

నాగార్జునసాగర్‌లో పర్యాటక లాంచీల విహారం ప్రారంభం

నాగార్జునసాగర్‌ : కరోనా నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో నిలిపేసిన పర్యాటక లాంచీల విహారం శుక్రవారం ఉదయం నుంచి తిరిగి ప్రారంభమైంది. పర్యాటకులు జలాశయంలో విహరించేందుకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పర్యాటక శాఖకు చెందిన మూడు లాంచీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాగార్జున కొండకు వెళ్లేందుకు అనుమతి లేనందున జాలీ ట్రిప్పులకు మాత్రమే లాంచీలను పరిమితం చేస్తున్నామని పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌ జలాశయంలో నిండటంతో లాంచీల్లో విహరిస్తూ నల్లమల అటవీ అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలిరానున్నారు. నది ప్రవాహ ఉధృతి తగ్గితే శ్రీశైలానికి సైతం లాంచీలు నడిపేందుకు పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.