గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 15:01:09

గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్‌ రెడీ

గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్‌ రెడీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మహత్తర పోరాటాలతో తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్‌ అభివృద్ధిలో కూడా అదే పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారు. దశాబ్దాల సాగు, తాగు నీటి కోసం అల్లాడిన తెలంగాణ ప్రజల కష్టాలను మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథతో తీర్చారు. ఎన్నో జలాశయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు.

అందులో భాగంగా హైదరాబాద్‌ నగరానికే తలమానికంగా నిలిచే గండి‌పేట జలాశయాన్ని పర్యా‌ట‌కంగా అభి‌వృద్ధి చేసేందుకు హెచ్‌‌ఎం‌డీఏ చర్యలు చేపడుతున్నది. సుమారు రూ.30 కోట్లతో పద‌హారు ఎక‌రాల స్థలంలో.. అత్యా‌ధు‌నిక పార్క్‌లో ల్యాండ్‌‌స్కే‌ప్‌ నిర్మా‌ణానికి డిజైన్‌ సిద్ధమైంది. దీంతో భాగ్యనగర శోభ మరింత పరిఢవిల్లనున్నది.

VIDEOS

logo