శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 02:20:34

8 సంస్థలకు టూరిజం అవార్డులు

8 సంస్థలకు టూరిజం అవార్డులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టూరిజం అభివృద్ధికి కృషిచేసిన ఎనిమిది సంస్థలకు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తున్నట్టు పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక స్టేక్‌హోల్డర్లు, ట్రావెల్‌ ఏజెంట్లు, టూర్‌ ఆపరేటర్లు, ట్రావెలర్స్‌ మొదలైనవారితో వెబినార్‌ ద్వారా ఆయన సమావేశమయ్యారు.

అవార్డు పొందిన సంస్థలు

1. క్లాసిఫైడ్‌ ఫైస్టార్‌ హోటల్స్‌ విభాగంలో: తాజ్‌ ఫలక్‌నూమా ప్యాలెస్‌  

2. హైదరాబాద్‌లోని 4స్టార్‌ క్లాసిఫైడ్‌ హోటల్స్‌ విభాగంలో: ది గోల్కొండ హోటల్‌

3. హైదరాబాద్‌ మినహా 4స్టార్‌ క్లాసిఫైడ్‌ హోటల్స్‌ విభాగంలో: అలంకృత రిసార్ట్‌ అండ్‌ స్పా, సితార రామోజీ ఫిలింసిటీ

4. హైదరాబాద్‌లో త్రీస్టార్‌ హోటల్స్‌ విభాగంలో: మినర్వా గ్రాండ్‌ (సికింద్రాబాద్‌), హోటల్‌  అబ్డె శ్రీవెంకటేశ్వర లాడ్జి

5. బెస్ట్‌ వే సైడ్‌ ఎమినిటీస్‌ (హైదరాబాద్‌ బయట): ఎస్‌ఎస్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వివేరా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌(నార్కట్‌పల్లి)

6. బెస్ట్‌ టూర్‌ ఆపరేటర్స్‌: ఆర్వీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ 

7. బెస్ట్‌ ట్రావెల్‌ ఏజెంట్‌: సదరన్‌ ట్రావెల్స్‌ 

8. హైదరాబాద్‌ బయట బెస్ట్‌రెస్టారెంట్‌: ఫుడ్‌కోర్టులు


logo