మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:00

‘చిలుకూరు’ సన్నిధిలో తాబేలు

‘చిలుకూరు’ సన్నిధిలో తాబేలు

  • శుభసూచకంగా భావిస్తూ ప్రత్యేక పూజలు

మొయినాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని నిర్వాహకులు మూసివేసి స్వామివారికి ఏకాంత పూజలు నిర్వహిస్తున్నా రు. ఆదివారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో(సుందరేశ్వరస్వామి) శివలింగం పక్కన తాబేలు ప్రత్య క్షం కావడంతో పూజారులు ఆశ్చ ర్యం వ్యక్తంచేశారు. పది సెంటీమీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ తాబేలు శివాలయంలోకి ఎలా వచ్చిందో అంతుబట్టడం లేదని ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌, శివాలయం పూజారి సురేశ్‌ అన్నారు. ఆలయంలోకి తాబేలు ప్రవేశించడం శుభ సూచకమన్నారు. త్వరలోనే  కరోనా వైరస్‌ అంతమొందుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.logo