గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 06:20:13

మొదట 4 జిల్లాలకు, 15వ తేదీ తరువాత మిగితా జిల్లాలకు కందిపప్పు

మొదట 4 జిల్లాలకు, 15వ తేదీ తరువాత మిగితా జిల్లాలకు కందిపప్పు

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల ఆకలితీర్చేందుకు ప్రభుత్వం ప్రకటించిన రెండోవిడుత ఉచిత బియ్యం పంపిణీ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నది. తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులు ఒక్కొరికి ఉచితంగా 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లుచేసింది. ఆహారభద్రత కార్డుఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కోకార్డుపై రూ.1500 నగదు అందించింది. మొదటి విడతలో నిజామాబాద్‌, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌, మెదక్‌ జిల్లాల్లో ప్రతీకార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా పంపిణీ చేయనున్నారు. రూ.1500 నగదును బ్యాంకు ఖాతాల్లో పడని వారికి  పోస్టాఫీసు ఖాతాల్లో జమచేయనున్నారు. మే 1న బ్యాంకులకు సెలవు కావడంతో 2వతేదీనుంచి ఈ నగదును జమ చేయనున్నారు. 

కందిపప్పు 4 జిల్లాల్లోనే ఎందుకు!

కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు నాఫెడ్‌ ద్వారా రాష్ర్టానికి నెలకు 8,754 టన్నుల కందిపప్పు రావాల్సి ఉన్నది. అయితే ఇప్పటివరకు 3,233 టన్నులు మాత్రమే సరఫరా చేసింది. దీంతో ముందుగా నాలుగు జిల్లాల్లోనే సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. నాఫెడ్‌ సరఫరాచేసే దానికి అనుగుణంగా మిగిలిన 29  జిల్లాల్లో 15వ తేదీ తర్వాత పంపిణీ చేయనున్నట్టు వివరించారు.


logo