మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 14:47:02

రేపు, ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ.. ఏర్పాట్ల పరిశీలన

రేపు, ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ.. ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్‌ : ఈ నెల 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను జరుగనున్నాయి. ఈ మేరకు సోమవారం సమావేశాల ఏర్పాట్లను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ ప్రాంగణం, సభ లోపల శానిటైజేషన్‌ చేయించాలని సూచించారు. అలాగే అలాగే సమావేశాల బందోబస్తుపై డీజీపీ, సీపీతో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. అలాగే కరోనా మహమ్మారి నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. సభ్యులు, సిబ్బంది, పోలీసులు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు.

కరోనా లక్షణాలు, అనుమానం ఉన్న వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కాగా, గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌ మున్సి‌పల్‌ కార్పొ‌రే‌షన్‌ (జీ‌హె‌చ్‌‌ఎంసీ) చట్టాల్లో కొన్ని సవ‌ర‌ణల బిల్లుకు, హైకోర్టు సూచించిన మరి‌కొన్ని అంశా‌ల్లోనూ చట్టాలు చేయాల్సి ఉన్నం‌దున అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. త్వరలో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందుగానే చట్టాలను సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారం వరకు ఉంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌ ఎన్నికలకు ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది. నవంబర్‌, డిసెంబర్‌లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo