శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 17, 2020 , 01:43:18

రేపు కృష్ణానది యాజమాన్య బోర్డు భేటీ

రేపు కృష్ణానది యాజమాన్య బోర్డు భేటీ

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, కేంద్ర మంత్రి ఆదేశాలు జారీచేయడంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఏపీ జలవనరులశాఖకు రెండుసార్లు లేఖ రాసినా స్పందించకపోవడంతో తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై అధికారులు దృష్టిసారించే అవకాశాలున్నాయి.

 దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాల్సిందిగా ఏపీ జలవనరులశాఖకు మరోసారి లేఖ రాసే అవకాశాలున్నట్టు తెలిసింది. ఢిల్లీస్థాయిలో రెండు రాష్ర్టాల సీఎంలతో జరుగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీపై బోర్డు అధికారులు చర్చించనున్నారు. దీనిపై రెండు రాష్ర్టాల నుంచి సమాచారాన్ని తీసుకొని ఎప్పుడు నిర్వహించాలనే దానిపై అభిప్రాయాలు, తేదీని సూచించాలని కోరే అవకాశమున్నది. తద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి తేదీలను సూచిస్తూ కేంద్ర జలవనరులశాఖకు సమాచారం ఇవ్వనున్నారు.


logo