బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 31, 2020 , 01:15:31

రేపు పద్మశ్రీ వెంకటరెడ్డికి ఆత్మీయ సత్కారం

రేపు పద్మశ్రీ వెంకటరెడ్డికి ఆత్మీయ సత్కారం
  • రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌, పద్మశ్రీ
  • డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వినూత్న సాగు పద్ధతులను అవలంభిస్తున్న సికింద్రాబాద్‌ అల్వాల్‌కు చెందిన సేంద్రియ రైతు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చింతల వెంకటరెడ్డికి రైతునేస్తం ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ అభినందన సత్కారం నిర్వహించనున్నట్టు ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 


వినూత్న సాగు పద్ధతులను పాటిస్తూ అద్భుత ఫలితాలను సాధించిన చింతల వెంకటరెడ్డికి పద్మశ్రీ అవార్డు లభించిన సందర్భంగా శనివారం సాయం త్రం 6 గంటలకు లక్డీకపూల్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో అభినందన సభ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్‌ వీ ప్రవీణ్‌రావు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి, ఆల్‌ ఇండియా కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి పాల్గొంటారని వెంకటేశ్వరరావు తెలిపారు.


logo