శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 19:17:41

చప్పట్లు కొడదాం... ఐక్యతను చాటుదాం...

చప్పట్లు కొడదాం... ఐక్యతను చాటుదాం...

హైదరాబాద్‌: రేపు సాయంత్రం 5 గంటలకు సైరన్‌ మోగుతుంది. సైరన్‌ మోగగానే ఎవరి ఇంటి ముందు వారు నిలుచొని చప్పుట్లు కొట్టి మన ఐక్యతను చాటాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ మేమంతా అప్రమత్తంగా ఉన్నామని తెలియజేయడానికి ఉదయం 5 గంటలకు రెండు నిమిషాల పాటు చప్పట్లు కొట్టాలని పిలుపునిస్తే కొందరు దాన్ని అవహేళన చేస్తున్నారని, అది మంచి పద్దతి కాదన్నారు. ఒక దురదృష్ట కరమైన మహమ్మారితో పోరాటం చేస్తున్నాం. జనతా కర్ప్యూ సందర్భంగా మేమంతా ఐక్యంగా ఉన్నామని తెలియజేయడానికే ప్రధాని ఈ విధంగా పిలుపునిచ్చారు. 


దీన్ని సోషల్‌ మీడియాలో ప్రధాన మంత్రినే అవహేళల చేస్తూ సంస్కారం లేకుండా కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందల పిలుపునిచ్చినం. ఇంటి బయటకు వచ్చి గంట కొట్టాలన్నం. గంట లేనివారు. గంట లేనివారు ప్లెట్లు, గరిటలతో శబ్దం చేసి తమ మద్దతు తెలిపారు. ఒకదానిపై పోరాటం చేస్తున్నప్పుడు జనంను సమాయత్తం చేసేందుకు, ఐక్యతను ప్రదర్శించేందుకు ఇటువంటి పిలుపులిస్తుంటామని పేర్కొన్నారు. దీనికి రూపాయి ఖర్చు కాదు, మొద్దులు మోసే పనిలేదు. రెండు చేతులు జోడించి చప్పట్లు కొడితే మనలకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. దీంతో భారత జాతి ఒక్కటై సమస్యపై పోరాటం చేస్తుందన్న స్పూర్తి ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సైరన్‌ మోగగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చి రెండు నిమిషాలు చప్పట్లు కొట్టాలని కోరారు. 


logo