శుక్రవారం 29 మే 2020
Telangana - Mar 28, 2020 , 17:41:02

కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌నే సీసీసీ ఏర్పాటు...

కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌నే సీసీసీ ఏర్పాటు...

ప్ర‌జ‌లంద‌రూ కూడా స్వ‌యంగా ఇంట్లోనే క‌రోనా వైర‌స్ తో సైనికుల్లా పోరాడుతున్న సంద‌ర్భంలో మ‌న గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో అద్భుత‌మైన పోరాటం జ‌రుగుతోందని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న ఈ సంద‌ర్భంలో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వేలాది మంది కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌నే సంక‌ల్పంతో చిరంజీవి ఆధ్వ‌ర్యంలో సి. సి. సి. (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ని ఏర్పాటు చేశాం. ఈ సంస్థ‌కి ఛైర్మ‌న్‌గా మెగాస్టార్ చిరంజీవి ఉంటారు.

స‌భ్యులుగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, సురేష్ బాబు , సి.కల్యాణ్ , దాము , బెన‌ర్జీ , నేను స‌భ్యులుగా ఉంటాము. సి. సి. సి. మ‌న‌కోసం క‌మిటీతో పాటు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ , గీతా ఆర్ట్స్ బాబు, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు , ప‌రుచూరి గోపాల‌కృష్ణ , కొమరం వెంక‌టేష్ , ఫెడ‌రేష‌న్‌కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయ‌కులు అంద‌రూ కూడా ఈ సేవా కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు అవుతున్నారు. ఈ క‌రోనా వైర‌స్ మీద‌. క‌రోనాను అంత‌మొందించే ప్ర‌య‌త్నంలో ప్ర‌జ‌లంద‌రూ కూడా భాగస్వాములు కావాలి. మీ ఇళ్ళలోనే ఉంటూ క‌న‌బ‌డ‌ని శ‌త్రువుతో పోరాడండి. విజ‌యం సాధిద్దాం.. సాధిస్తాం.. ఈ సేవా కార్య‌క్ర‌మానికి మ‌న గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆశీస్సులు, మ‌న పుర‌పాల‌క ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అండ‌దండ‌లు, అధికారుల‌, పోలీస్ శాఖ వారి స‌హాయ‌స‌హ‌కారాలు కావాల‌ని కోరుతున్నామని అన్నారు.


logo