మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 22:45:39

సీబీఎస్‌ఈ విద్యార్థుల కోసం టోల్‌ఫ్రీ హెల్ఫ్‌లైన్‌

సీబీఎస్‌ఈ విద్యార్థుల కోసం టోల్‌ఫ్రీ హెల్ఫ్‌లైన్‌

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) టోల్‌ఫ్రీ హెల్ఫ్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభించినట్టు  బోర్డు కార్యదర్శి అనురాగ్‌ త్రిపాఠి తెలిపారు. టోల్‌ఫ్రీనంబర్‌ 1800118004 సేవలను ఉదయం ఎనిమిదింటి నుంచి రాత్రి ఎనిమిదింటిదాకా మార్చి 31 వరకు వినియోగించుకోవచ్చని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కొవిడ్‌-19 వ్యాప్తి నివారణకు ఇంట్లో తీసుకోవాల్సిన చర్యలను శిక్షణ పొందిన కౌన్సిలర్లు ఫోన్‌లో వివరిస్తారని వెల్లడించారు. బోర్డు అన్ని పరీక్షలను మార్చి 31 వరకు వాయిదావేయడంతోపాటు మూల్యాంకన పనులను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే.logo
>>>>>>