బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:27:42

నైరుతి మందగమనం

నైరుతి మందగమనం

  • నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వానలు

హైదరబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ, మందకొడిగా కదులుతున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. రుతుపవనాల విస్తరణ వేగం తగ్గినప్పటికీ.. రానున్న రెండు, మూడురోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వివరించారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌, నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో 4 సెంటీమీటర్ల చొప్పున, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌, నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో 3, నిజామాబాద్‌ జిల్లా కోటగిరి, వేల్పూర్‌లలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆదివారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1.4 సెంటీమీటర్లు, పెద్ద అంబర్‌పేటలో 1.1, కాప్రా, హయత్‌నగర్‌ మండలం హస్తినాపురంలో 1 సెంటీమీటర్‌ వర్షపాతం నమోదైంది.


logo