బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 01:30:22

నేడు, రేపు తేలికపాటి వానలు

నేడు, రేపు తేలికపాటి వానలు

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో  అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాగల మూడ్రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్‌,  భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద 

కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ బరాజ్‌ వద్ద 41,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కృష్ణాబేసిన్‌లోని ఆల్మట్టికి భారీ స్థాయిలో వరద వస్తుండటంతో ఒక్కరోజే  5.94 టీఎంసీల నీరు చేరింది. 129.72 టీఎంసీలకు ప్రస్తుతం 82.53 టీఎంసీల నీరున్నది.  


logo