గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 21:26:36

తెలంగాణలో 1269 కరోనా కేసులు

తెలంగాణలో 1269 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆదివారం 1269 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 800 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34,671 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఎనిమిది మంది మృతి చెందగా,   మరణించిన వారి సంఖ్య 356కు చేరింది. ఇవాళ1563 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 22482 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11883 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

ఆదివారం 8153 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 1,70,324 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. ఆదివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 800, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌ జిల్లాలో 94 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వివరించింది. 


logo