శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 18:10:41

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. జీన్ ఎడిటింగ్‌.. ర‌సాయ‌న శాస్త్రంలో ఇద్ద‌రికి నోబెల్‌


ర‌సాయ‌న శాస్త్రంలో ఈ యేటి నోబెల్ బ‌హుమ‌తి ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రించింది.  జీన్యువుల స‌వ‌ర‌ణ ‌(జీనోమ్ ఎడిటింగ్‌) కోసం ఓ కొత్త విధానాన్ని అభివృద్ధిప‌రిచిన ఎమ్మాన్యువ‌ల్ చార్‌పెంటైర్‌, జెన్నిఫ‌ర్ ఏ డౌనాల‌కు ఆ అవార్డు ద‌క్కింది.  జ‌న్యువు టెక్నాల‌జీతో ఓ కొత్త ర‌క‌మైన, చాలా ప‌దునైన విధానాన్ని ఈ ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు డెవ‌ల‌ప్ చేశారు. మ‌రింత స‌మాచారం కోసం..

2. భార‌త టెకీల‌కు ఝ‌ల‌క్‌.. హెచ్‌1బీ వీసా కోసం కొత్త రూల్స్


భార‌తీయ టెకీల‌కు ట్రంప్ స‌ర్కార్ షాకిచ్చింది. హెచ్‌1-బీ వీసాల సంఖ్య‌ను త‌గ్గిస్తూ కొత్త ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించింది.  విదేశాల‌కు చెందిన నైపుణ్య కార్మికుల‌కు ఇచ్చే వీసాల‌ను ప‌రిమితం చేస్తున్నట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల దేశంలో ఉద్యోగ క‌ల్పిన భార‌మైనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. మ‌రింత స‌మాచారం కోసం..

3. గ్రామాల్లోనే వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తాం : సీఎం కేసీఆర్


రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని తెలిపారు.మ‌రింత స‌మాచారం కోసం..

4. కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడంలో మహిళలు ముందంజ


కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో మహిళల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. కొవిడ్‌ -19 నిబంధనలు పాటించడంలో పురుషుల కంటే మహిళలు ఆదర్శంగా ఉంటున్నారని స్పష్టమైంది. న్యూయార్క్‌, యేల్‌ యూనివర్సీటీ పరిశోధనలో ఈ విషయం వెల్లడి కాగా బిహేవియర్‌ సైన్స్‌ అండ్‌ పాలసీలో ఈ ఆర్టికల్‌ ప్రచురితమైంది. మ‌రింత స‌మాచారం కోసం..

5. ఎస్సీ, ఎస్టీల‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దాలి : మ‌ంత్రి కేటీఆర్


 రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వ‌ర్, స‌త్య‌వ‌తి రాథోడ్ క‌లిసి ప్రారంభించారు. తమ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు వర్గాలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నదని తెలిపారు.మ‌రింత స‌మాచారం కోసం..

6. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి.. నిర్ధారించిన అమెరికా సంస్థ


గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఆండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) పేర్కొంది. కరోనా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడిన తుంపర్లలో వైరస్‌ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణిస్తుందని తెలిపింది. మ‌రింత స‌మాచారం కోసం..

7. అటల్‌ టన్నెల్‌లో ఆంక్షలు


హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 3న ప్రారంభించిన అటల్‌ టన్నెల్‌లో మరిన్ని ఆంక్షలు విధించారు. ఈ టన్నెల్‌ను సందర్శించే పర్యాటకుల తాకిడి పెరుగుతుండటంతో గత మూడు రోజుల్లో పలు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అటల్‌ టన్నెల్‌ ప్రాంతంలో పలు ఆంక్షలు విధించినట్లు కులు జిల్లా కలెక్టర్‌ రిచా వర్మ తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం..

8. దుబ్బాక బీజేపీలో భ‌గ్గుమ‌న్న విభేదాలు


దుబ్బాక బీజేపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావుకు అస‌మ్మ‌తి సెగ మొద‌లైంది. పార్టీ కోసం ఎప్ప‌ట్నుంచో ప‌ని చేస్తున్న త‌న‌ను వ‌దిలేసి రఘునంద‌న్‌రావుకు టికెట్ ఇవ్వ‌డం దారుణ‌మ‌ని బీజేపీ నేత క‌మ‌లాక‌ర్ రెడ్డి అన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన‌ కార్య‌క‌ర్త‌ను కాద‌ని ఒక రేపిస్ట్‌కు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ టికెట్ కేటాయించింది అని విమ‌ర్శించారు. మ‌రింత స‌మాచారం కోసం..

9. డ్ర‌గ్స్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తికి బెయిల్ మంజూరు


బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తికి ఇవాళ ముంబై హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. ఆమె సోద‌రుడు శౌవిక్ చ‌క్ర‌వ‌ర్తికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాక‌రించింది.  హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆ ఇద్ద‌ర్నీ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.మ‌రింత స‌మాచారం కోసం..

10. నవంబర్‌, డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు : కమిషనర్‌ పార్థసారధి


గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నవంబర్‌, డిసెంబర్‌లో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ప్రకటించారు. బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. మ‌రింత స‌మాచారం కోసం..

11. IPL 2020:కోల్‌కతా జట్టుకు మరో ఎదురుదెబ్బ