బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 18:13:13

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు


రాష్ర్టంలో పెట్టుబ‌డుల‌పై ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.మ‌రింత స‌మాచారం కోసం..

2. అమెజాన్ పెట్టుబ‌డుల‌పై మంత్రి కేటీఆర్ హ‌ర్షం


అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు రూ. 20 వేల 761 కోట్ల పెట్టుబ‌డులు తెలంగాణ రాష్ట్రంలోకి రావడం పట్ల ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా అమెజాన్ సంస్థ‌కు మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం..

3. ధరణిలో భూ వివరాలు తెలుసుకోండిలా..


ప్రస్తుతం తెలంగాణ మొత్తం ధరణి పోర్టల్ గురించి మాట్లాడుతున్నది. ధరణిలో నమోదై ఉన్న భూములను ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్క క్లిక్‌తో చూడవచ్చు. మ‌రింత స‌మాచారం కోసం..

4. 'ధరణి' పోర్ట‌ల్‌ను దుర్వినియోగం చేసిన మహిళ అరెస్ట్


భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌ల్పించే దిశ‌గా రాష్ర్ట ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన‌ ధరణి పోర్టల్‌ను ఓ మ‌హిళ దుర్వినియోగ‌ప‌రిచింది. ఒక వ్య‌క్తికి అమ్మిని భూమిని రెండోసారి త‌న కూతురి పేర‌ రిజిస్ర్టేష‌న్‌ చేయించుకుని రెవెన్యూ, పోలీసు ఉన్న‌తాధికారుల‌కు అడ్డంగా దొరికిపోయింది. మ‌రింత స‌మాచారం కోసం..

5. అమెరికా అధ్యక్షుడిని తేల్చేది ఈ రాష్ట్రాలే!


రెండు రోజుల నుంచి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉన్న‌ది.  అధ్య‌క్షుడు ట్రంప్‌, ప్ర‌త్య‌ర్థి బైడెన్‌ల మ‌ధ్య పోరు ఆస‌క్తిక‌రంగా మారింది.  ప్ర‌స్తుతానికి మ్యాజిక్ ఫిగ‌ర్‌కు బైడెన్ ద‌గ్గ‌ర్లోనే ఉన్నా.. ట్రంప్ కూడా పీఠాన్ని కైవ‌సం చేసుకునే అవ‌కాశాలూ ఉన్నాయి.మ‌రింత స‌మాచారం కోసం..

6. బైడెన్‌కు సీక్రెట్ స‌ర్వీస్ ప్రొటెక్ష‌న్‌


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో లీడింగ్‌లో ఉన్న మాజీ ఉపాధ్య‌క్షుడు, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌కు భ‌ద్ర‌త‌ను పెంచ‌నున్నారు.  ఆ దేశానికి చెందిన సీక్రెట్ స‌ర్వీస్‌.. బైడెన్ వ‌ద్ద‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను పంపించ‌నున్న‌ది. మ‌రింత స‌మాచారం కోసం..

7. పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్‌కు ఊర‌ట‌


కౌంటింగ్ ఆపివేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఫిర్యాదుల‌కు పెన్సిల్వేనియాలో ఊర‌ట ల‌భించింది.మ‌రింత స‌మాచారం కోసం..

8. పదవికి రాజీనామా చేసే యోచనలో రష్యా అధ్యక్షుడు ‌!


ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్కిన్స‌న్స్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారా..? ఈ వ్యాధి కార‌ణంగా ఆయన ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్నారా..? ఈ మేర‌కు పుతిన్ ఇప్ప‌టికే ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారా..? వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఆయ‌న అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్నారా..? మ‌రింత స‌మాచారం కోసం..

9. చైనా ల్యాబ్‌నుంచి బ్యాక్టీరియా లీక్‌.. ఒకేసారి 6,000 మందికి వ్యాధి!


గతేడాది చైనా నుంచి వ్యాప్తిచెందిన కరోనా సృష్టిస్తున్న విలయం తెలిసిందే. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఇంకా దీని ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా, దీనికితోడు చైనా నుంచే మరో వ్యాధి వ్యాప్తి చెందుతోంది.మ‌రింత స‌మాచారం కోసం..

10. నూత‌న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన సీఎస్


నూతన సచివాలయ భవన నిర్మాణ ప‌నుల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి క‌లిసి ప‌రిశీలించారు. సమీకృత కొత్త సచివాలయానికి ఇప్పటికే ఔట్ లైన్ ముగ్గు పోసిన‌ షాపూర్జీ పాల్లొంజీ నిర్మాణ సంస్థ ప‌నులు ప్రారంభించింది. మ‌రింత స‌మాచారం కోసం..

11. రాడికో ఖైతాన్ రూ. 50 ల‌క్ష‌ల విరాళం


ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌తో అతాల‌కుత‌ల‌మైన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు రాడికో ఖైతాన్ లిమిటెడ్ కంపెనీ ముందుకు వ‌చ్చింది.మ‌రింత స‌మాచారం కోసం..

12. గుడ్ న్యూస్.. వాట్స‌ప్‌లో డిజిట‌ల్ చెల్లింపు సేవ‌లు


సామాజిక మాధ్య‌మం వాట్సాప్‌లో డిజిట‌ల్ చెల్లింపు సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ సేవ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తించిన‌ట్లు ఫేస్‌బుక్ సీఈవో జుక‌ర్‌బ‌ర్గ్ ప్ర‌క‌టించారు. మ‌రింత స‌మాచారం కోసం..

13. భార‌త్‌పై సోష‌ల్ మీడియాలో పాక్ దుష్ర్ప‌చారాలు : రావ‌త్‌


ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్ ఇమేజ్ పెరుగుతున్న నేప‌థ్యంలో.. స‌మాంత‌రంగా దేశానికి భ‌ద్ర‌తా స‌వాళ్లు కూడా ఎదుర‌వుతుంటాయ‌ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు. నిరంత‌ర బెదిరింపుల నుంచి దేశం బ‌య‌ట‌ప‌డాల‌ని,  దానికి త‌గిన‌ట్లు సైనిక అవ‌స‌రాల‌ను తీర్చుకోవాల‌న్నారు.  మ‌రింత స‌మాచారం కోసం..

14. భార‌త్‌కు మరోసారి కరోనా ముప్పు : డబ్ల్యూహెచ్ఓ