సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 17:53:42

టుడే న్యూస్ హైలెట్స్‌..

టుడే న్యూస్ హైలెట్స్‌..

1. రుజువు చేస్తే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా : ‌కేసీఆర్


భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పెన్ష‌న్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను సీఎం ఎండ‌గ‌ట్టారు. పెన్ష‌న్ల‌కు కేంద్రం డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని చెబుతున్నారు. ఒక వేళ దాన్ని ఎవ‌డైనా మొగోడు రుజువు చేస్తే ఒక్క‌టే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతాను అని సీఎం కేసీఆర్ స‌వాల్ చేశారు.మ‌రింత స‌మాచారం కోసం..

2. రైతు వేదిక ఒక ఆటం బాంబు : సీఎం కేసీఆర్


రైతు వేదిక నా గొప్ప క‌ల.. రైతాంగం ఒక‌చోట కూర్చొని మాట్లాడుకోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడిన‌ట్లే చ‌ర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక శ‌క్తి అని పేర్కొన్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

3. విలీన గ్రామాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం


మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. మ‌రింత స‌మాచారం కోసం..

4. కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్


జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో రైతు వేదిక‌ను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.మ‌రింత స‌మాచారం కోసం..

5. ష‌బ్బీర్ అలీ దొంగ ముచ్చ‌ట్ల‌పై సీఎం కేసీఆర్ ధ్వ‌జం


‌కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ దొంగ ముచ్చ‌ట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కిరికిరిగాళ్ల ముచ్చ‌ట్లు ఎట్ల ఉంటాయో ష‌బ్బీర్ అలీ క‌థ చూస్తే అర్థ‌మైత‌ద‌ని కేసీఆర్ తెలిపారు.మ‌రింత స‌మాచారం కోసం..

6. వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు కేటీఆర్ అభినంద‌న‌


వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో నాలాలు, డ్రైన్ల‌కు ఉన్న అడ్డంకులు తొల‌గించేందుకు బాగా ప‌ని చేశార‌ని కొనియాడారు.మ‌రింత స‌మాచారం కోసం..

7. కాక‌తీయుల‌ను మించిన మ‌హానుభావుడు కేసీఆర్ : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి


ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కాక‌తీయ రాజుల‌ను మించిన మ‌హానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. మ‌నంద‌రం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి.మ‌రింత స‌మాచారం కోసం..

8. ఇక చైనా నౌకాదళంపై భారత్‌ దృష్టి


లఢక్‌ సరిహద్దు నుంచి చైనా నౌకాదళం వైపు భారత్‌ దృష్టి మళ్లింది. తూర్పు లఢక్‌ సరిహద్దు ప్రాంతంలో శీతాకాలం ఆరంభం సందర్భంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సున్నా దిగువకు చేరుతున్నాయి. మ‌రింత స‌మాచారం కోసం..

9. 'హిందూత్వం హిందూ మతం కాదు'


హిందుత్వ ఉద్యమం 1947 నాటి ముస్లిం మతతత్వానికి ప్రతిబింబమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ అన్నారు. హిందూత్వం హిందూ మతం కాదని.. అది ఒక రాజకీయ సిద్ధాంతమని నొక్కి చెప్పారు.మ‌రింత స‌మాచారం కోసం..

10. సైనికుల త్యాగాలపై రాజకీయాలు చేయొద్దు : ప్రధాని


ఉగ్రవాదంపై భారత్‌ నిరంతర పోరు సాగిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించారు.మ‌రింత స‌మాచారం కోసం..

11. కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీజేపీలో ఓ భాగం: శివ‌సేన


ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ECI)పై శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈసీఐ బీజేపీలోని ఓ విభాగ‌మ‌ని విమ‌ర్శించారు.మ‌రింత స‌మాచారం కోసం..

12. అమెరికాలో 24 గంట‌ల్లో 94 వేల పాజిటివ్ కేసులు


అమెరికాలో అత్య‌ధికంగా గ‌త 24 గంట‌ల్లో 94వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  అధ్య‌క్ష ఎన్నిక‌ల‌క