బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 17:56:58

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. మ‌హాప్ర‌స్థానంలో ముగిసిన‌ నాయిని అంత్య‌క్రియ‌లు


 తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో ముగిశాయి. ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.మ‌రింత స‌మాచారం కోసం..

2. వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ రూ. 10 కోట్లు విరాళం


హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ అండ‌గా నిలిచింది. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించింది హెటిరో డ్ర‌గ్స్. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 కోట్లు విరాళం అందించిన‌ట్లు హెటిరో డ్ర‌గ్స్ చైర్మ‌న్ పార్థ‌సార‌థి రెడ్డి వెల్ల‌డించారు. మ‌రింత స‌మాచారం కోసం..

3. ‘డాక్టర్ రెడ్డీస్‌’పై సైబర్ దాడి


హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఔషధాల తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌పై సైబర్‌ దాడి జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను ఆ సంస్థ నిలిపివేసింది. డేటా చోరీ యత్నాన్ని గుర్తించినట్లు ఆ కంపెనీ గురువారం తెలిపింది.మ‌రింత స‌మాచారం కోసం..

4. నాయిని మృతిప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంతాపం


తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి మృతిప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ సంతాపం ప్ర‌క‌టించారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌కు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. మ‌రింత స‌మాచారం కోసం..

5. వ‌ర‌ద బాధితుల‌కు రామోజీ రూ. 5 కోట్ల విరాళం


రామోజీ గ్రూప్ ఛైర్మ‌న్ రామోజీరావు రూ.5 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ల వ‌ల‌న నిరాశ్ర‌యులైన బాధితుల‌కు ఆహారం, స‌రుకులు అందించేందుకు గాను రూ.5 కోట్ల రూపాయ‌ల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించ‌నున్న‌ట్టు తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం..

6. కిడ్నాప్ చేసిన గంట‌లోపే దీక్షిత్ రెడ్డి హ‌త్య‌


మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి(9)ని హ‌త్య చేశారు. కేసముద్రం మండలం అన్నారం వ‌ద్ద‌ దానమయ్య గుట్టపై బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.మ‌రింత స‌మాచారం కోసం..

7. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ టూ మ‌ర్డ‌ర్‌.. ఏం జ‌రిగిందంటే?


జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్ రెడ్డి(9)ని కిడ్నాప్ చేసి, దారుణంగా హ‌త్య చేసిన విష‌యం విదిత‌మే. దీక్షిత్ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు మంద సాగ‌ర్‌(23)ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివ‌రాల‌ను ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్ల‌డించారు.మ‌రింత స‌మాచారం కోసం..

8. హైద‌రాబాద్‌లో స్వ‌ల్ప భూప్ర‌కంప‌న‌లు


నగరంలోని వస్థలీపురం బీఎన్‌రెడ్డి నగర్‌, వైదేహినగర్‌లో గురువారం వేకువ జామున భూ ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారు జామున 5.40 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. శబ్దాలు రావడంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. మ‌రింత స‌మాచారం కోసం..

9. క‌రోనా వైర‌స్ నిర్మూల‌న అసంభ‌వ‌మే !


 క‌రోనా వైర‌స్ నిర్మూల‌న అసంభ‌వ‌మే అని, ఆ వైర‌స్ ఎప్ప‌టికీ ఉంటుంద‌ని బ్రిటీష్ శాస్త్ర‌వేత్త తెలిపారు.  ప్ర‌భుత్వ అడ్వైజ‌రీ క‌మిటీలో స‌భ్యుడైన శాస్త్ర‌వేత్త జాన్ ఎడ్మండ్స్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.మ‌రింత స‌మాచారం కోసం..

10. వీసా నిబంధ‌న‌లు స‌డ‌లించిన కేంద్రం


కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ వీసా నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించింది. అన్ని వ‌ర్గాల‌ విదేశీయులు భార‌త్‌లోకి ప్ర‌వేశించేందుకు అనుమ‌తి ఇచ్చారు.  అయితే ప‌ర్యాట‌కం కోసం భార‌త్‌లో విజిట్ చేసేందుకు విదేశీయుల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.మ‌రింత స‌మాచారం కోసం..

11. నౌకాద‌ళంలోకి ఐఎన్ఎస్ కావ‌ర‌త్తి యుద్ధ‌నౌక


యాంటీ స‌బ్‌మెరైన్ యుద్ధ నౌక  ఐఎన్ఎస్ కావ‌ర‌త్తి ఇవాళ విశాఖ‌ప‌ట్ట‌ణంలోని నౌకాశ్ర‌యంలో జ‌ల‌ప్ర‌వేశం చేసింది.  భార‌త నౌకాద‌ళంలోకి ఆ యుద్ధ‌నౌక‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మ‌రింత స‌మాచారం కోసం..

12. చైనాలో లేహ్‌‌.. ట్విట్ట‌ర్‌కు వార్నింగ్‌


ల‌డాఖ్‌లోని లేహ్‌.. చైనాలో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ అకౌంట్ సెట్టింగ్స్‌లో ఉన్న‌ది.  దీని ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం త‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.  ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీకి ఈ నేప‌థ్యంలో వార్నింగ్ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.మ‌రింత స‌మాచారం కోసం..

13. నాగ్ మిస్సైల్.. ఫైన‌ల్ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్


నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ తుది ట్ర‌య‌ల్స్‌ను ఇవాళ విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ఈ క్షిప‌ణిని ఇవాళ రాజ‌స్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్‌ రేంజ్‌ల్లో ప‌రీక్షించారు.మ‌రింత స‌మాచారం కోసం..

14. ట్రంప్‌కు ఓటేయొద్దు... ఓ వృద్ధురాలి చివ‌రి కోరిక