శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 17:56:06

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. మాజీ హోంమంత్రి నాయినికి సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ‌


మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి సీఎం కేసీఆర్ బుధ‌వారం సాయంత్రం వెళ్లారు.మ‌రింత స‌మాచారం కోసం..

2. రాగ‌ల 24 గంట‌ల్లో రాష్ర్టంలో వ‌ర్షాలు!


ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కేంద్రీకృత‌మైంది. ఈ నేప‌థ్యంలో రాష్ర్టంలో రాగ‌ల 24 గంట‌ల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.మ‌రింత స‌మాచారం కోసం..

3. మూసీ న‌దికి శాంతి పూజ‌.. బోనం, ప‌ట్టువ‌స్ర్తాలు స‌మ‌ర్ప‌ణ‌


1908లో మూసీ న‌దికి భారీ వ‌ర‌ద‌లు రావ‌డంతో.. నాటి నిజాం మీర్ మ‌హ‌బూబ్ అలీఖాన్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. దాదాపు వందేళ్ల త‌ర్వాత మూసీకి మ‌ళ్లీ వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ఈ క్ర‌మంలో వ‌ర‌ద‌ల నుంచి హైద‌రాబాద్‌ను గ‌ట్టెక్కించాలంటూ బుధ‌వారం మ‌రోసారి పూజ‌లు చేశారు.మ‌రింత స‌మాచారం కోసం..

4. చెరువుల‌న్నీ నిండిపోయాయి.. అప్ర‌మ‌త్తంగా ఉండాలి


భారీ వర్షాలు, వరదల నేప‌థ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.మ‌రింత స‌మాచారం కోసం..

5. రేపు సాయంత్రం హైద‌రాబాద్‌కు కేంద్ర బృందం


హైద‌రాబాద్‌లో వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు గురువారం సాయంత్రం న‌గ‌రానికి కేంద్రం బృందం రానుంది.  రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం తీవ్రతను అంచ‌నా వేయ‌నున్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

6. బీజేపీ సోష‌ల్ మీడియా పుకార్ల పుట్ట : మ‌ంత్రి హ‌రీష్ రావు


భార‌తీయ జ‌న‌తా పార్టీ సోష‌ల్ మీడియా పుకార్ల పుట్ట‌.. అబ‌ద్దాల గుట్ట అని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు విమ‌ర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయ‌లో ప‌డొద్ద‌ని దుబ్బాక ఓట‌ర్ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.మ‌రింత స‌మాచారం కోసం..

7. పోలీసు అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్ ఘ‌న నివాళి


పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా విధి నిర్వ‌హ‌ణ‌లో అమ‌రులైన పోలీసుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న‌ నివాళుల‌ర్పించారు. పోలీసుల సేవ‌ల‌ను, త్యాగాల‌ను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

8. ద‌స‌రా బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం..


ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ బోన‌స్ ప్ర‌క‌టించింది.  కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ మీడియాతో వెల్ల‌డించారు.మ‌రింత స‌మాచారం కోసం..

9. చైనాలో ట్రంప్‌కు బ్యాంక్ అకౌంట్‌..


వాణిజ్య అంశంలో డ్రాగ‌న్ దేశం చైనాను ట్రంప్ వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అమెరికా అధ్య‌క్షుడికి చైనాలో బ్యాంక్ అకౌంట్ ఉన్న‌ట్లు న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక ఓ క‌థ‌నంలో పేర్కొన్న‌ది. మ‌రింత స‌మాచారం కోసం..

10. ల‌వ్ జిహాద్‌.. రేఖా శ‌ర్మపై గ‌గ్గోలు


జాతీయ మ‌హిళ సంఘం (ఎన్‌సీడ‌బ్ల్యూ) చీఫ్ రేఖా శ‌ర్మ‌పై ఆన్‌లైన్ యూజ‌ర్లు ఫైర్ అవుతున్నారు. మంగ‌ళ‌వారం మ‌హారాష్ట్ర గ‌వర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశియారితో భేటీ అయిన త‌ర్వాత రేఖా శర్మ ఓ ట్వీట్ చేశారు.  గ‌వ‌ర్న‌ర్‌తో మ‌తాంత‌ర వివాహాలు, ల‌వ్ జిహాద్ గురించి చ‌ర్చించిన‌ట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.  మ‌రింత స‌మాచారం కోసం..

11. నితీశ్‌ పాదాలకు నమస్కరించి.. ఆపై షాక్‌ ఇచ్చిన చిరాగ్‌


బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యవహారం జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) అధినేత, సీఎం నితీశ్‌ కుమార్‌కు తలనొప్పిగా మారింది. మ‌రింత స‌మాచారం కోసం..

12. చైనా సైనికుడిని అప్ప‌గించిన భార‌త ఆర్మీ


భార‌త భూభాగంలోకి అనుకోకుండా చొర‌బ‌డ్డ చైనా సైనికుడిని మంగ‌ళ‌వారం రాత్రి భార‌త ఆర్మీ ద‌ళాలు ఆ దేశానికి అప్ప‌గించాయి. కార్పోర‌ల్ వాంగ్ యా లాండ్ అనే పీఎల్ఏ సైనికుడు రెండు రోజుల క్రితం అక్ర‌మంగా వాస్త‌వాధీన రేఖ దాటి వ‌చ్చాడు.మ‌రింత స‌మాచారం కోసం..

13. థార్ ఎడారిలో క‌నుమ‌రుగైన న‌ది ఆన‌వాళ్లు గుర్తింపు


థార్ ఎడారిలో ల‌క్షా డెభ్బైరెండు వేల సంవ్స‌రాల క్రితం ప్ర‌వ‌హించి అనంత‌రం కాల ప్ర‌వాహంలో క‌నుమ‌రుగైన న‌ది ఆన‌వాళ్ల‌ను ప‌రిశోధ‌కులు తాజాగా క‌నుగొన్నారు. బిక‌నీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి ఆన‌వాలు కోల్పోయిన న‌ది గురించిన స‌మాచారాన్నిప‌రిశోధ‌కులు తాజాగా ఆధారాలతో స‌హా క‌నుగొన్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

14. వీసా తొక్కిస‌లాట‌.. 11 మంది మ‌హిళ‌లు మృతి


ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఇవాళ జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 11 మంది మ‌హిళ‌లు మృతిచెందారు. ఓ స్టేడియంలో నిర్వ‌హించిన వీసా మేళాలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.మ‌రింత స‌మాచారం కోసం..

15. చెన్నైకి షాక్‌.. ఐపీఎల్‌ నుంచి డ్వేన్‌ బ్రావో ఔట్‌


ఐపీఎల్‌-13 సీజన్‌లో  వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.   ఆ జట్టు    ఆల్‌రౌండర్‌  డ్వేన్‌ బ్రావో గజ్జల్లో గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మ‌రింత స‌మాచారం కోసం..