శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 18:14:22

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. రాబోయే మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు!


మ‌ంగ‌ళ‌వారం ఉదయం 8:30 గంటలకు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. రాష్ర్టానికి వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. మ‌రింత స‌మాచారం కోసం..

2. రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా : మంత్రి సబిత


రాష్ట్రంలో దసరా వరకు అన్నిపరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు.  అన్ని ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

3. తెలంగాణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్ల విరాళం


హైద‌రాబాద్ న‌గరాన్ని భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ర్ట ప్ర‌భుత్వాలు తెలంగాణ‌కు అండ‌గా నిలుస్తున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు.మ‌రింత స‌మాచారం కోసం..

4. వ‌ర‌ద బాధితుల‌కు మైహోమ్ రూ. 5 కోట్ల విరాళం


భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు ప్ర‌భావిత‌మైన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు మై హోమ్ సంస్థ రూ. 5 కోట్ల విరాళం ప్ర‌క‌టించింది.మ‌రింత స‌మాచారం కోసం..

5. హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. సినీ ప్ర‌ముఖుల భారీ విరాళం


బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌‌లువురు ముందుకు రావాల‌ని కేసీఆర్ కోర‌గా, తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ నుండి చిరంజీవి కోటి రూపాయ‌లు, మ‌హేష్ బాబు రూ.కోటి రూపాయ‌లు, నాగార్జున రూ. 50 ల‌క్ష‌లు, ఎన్టీఆర్ రూ. 50 ల‌క్ష‌లు, విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 ల‌క్ష‌లు అందించారు. మ‌రింత స‌మాచారం కోసం..

6. ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌


తెలంగాణలో అమలు చేసిన ఆన్‌లైన్‌​ ఆడిట్ విధానంపై కేంద్రం ప్ర‌శంస‌లు కురిపించింది. తెలంగాణ అమ‌లు చేసిన ఆడిట్ విధానాన్ని దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది వంద శాతం గ్రామపంచాయతీల‌లో ఆన్‌లైన్‌ ఆడిట్ నిర్వహించనున్నట్లు కేంద్ర పంచాయ‌తీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరి కేఎస్ సేథి వెల్లడించారు.మ‌రింత స‌మాచారం కోసం..

7. గోబెల్స్ ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాలి : మ‌ంత్రి హ‌రీష్ రావు


దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఇత‌ర పార్టీలు చేస్తున్న గోబెల్స్ ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని.. ఆ దిశ‌గా ప‌ని చేయాల‌ని టీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియా ఇన్‌ఛార్జీల‌కు మంత్రి హ‌రీష్ రావు సూచించారు. సిద్దిపేట‌లో ఇవాళ హ‌రీష్ రావు పార్టీ సోష‌ల్ మీడియా ఇన్‌ఛార్జీల‌తో స‌మావేశ‌మై ఎన్నిక‌ల ప్ర‌చారంపై దిశానిర్దేశం చేశారు. మ‌రింత స‌మాచారం కోసం..

8. పేరెంట్స్‌తో స‌మ‌స్య‌ లేదు : పీవీ సింధు


మేటి ష‌ట్ల‌ర్ పీవీ సింధు.. కొన్ని రోజుల క్రితం అక‌స్మాత్తుగా లండ‌న్ వెళ్లింది.  టోక్యోలో జ‌రిగే ఒలింపిక్స్ కోసం జాతీయ క్యాంపులో శిక్ష‌ణ తీసుకుంటున్న సింధు.. ఆగ‌మేఘాల మీద విదేశాల‌కు ప‌య‌న‌మైంది. మ‌రింత స‌మాచారం కోసం..

9. క‌రోనా రిక‌వ‌రీల్లో భార‌త్‌దే అగ్ర‌స్థానం


‌దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. రోజురోజుకు కొత్తగా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతూ రోజువారీ రిక‌వ‌రీల సంఖ్య పెరుగుతున్న‌ద‌ని, దాంతో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతున్న‌ద‌ని ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ చెప్పారు. మ‌రింత స‌మాచారం కోసం..

10. లోక్‌స‌భ‌, అసెంబ్లీ అభ్య‌ర్థుల ప్ర‌చార ఖ‌ర్చు ప‌రిమితి పెంపు


లోక్‌స‌భ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీప‌డే అభ్య‌ర్థుల‌కు అయ్యే ఖ‌ర్చు ప‌రిమితిని ప‌ది శాతం పెంచారు.  ఎన్నిక‌ల క‌మిష‌న్ జారీ చేసిన ప్ర‌తిపాద‌న‌ల ప్రకారం ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది.  కోవిడ్‌19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం నిమిత్తం అయ్యే ఖ‌ర్చు ప‌రిమితిని పెంచిన్న‌ట్లు తెలుస్తోంది.మ‌రింత స‌మాచారం కోసం..

11. ఇదేనా మ‌హిళ‌ల‌తో కాంగ్రెస్‌ న‌డుచుకునే తీరు?


కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌మ‌ల్‌నాథ్ ఐట‌మ్ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ మండిప‌డ్డారు. సీనియ‌ర్ నాయకుడు అయి ఉండి, ఒక మ‌హిళా నేత‌ను ఐట‌మ్ అని పేర్కొన‌డం చాలా దారుణ‌మ‌న్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

12. అత‌ని మాటలు వింటే.. 5 ల‌క్ష‌ల మంది చ‌నిపోయేవారు


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ఇంకా 15 రోజులే ఉన్న‌ది. అయితే ఎన్నిక‌ల తేదీ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో.. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి ఆ దేశ మేటి శాస్త్ర‌వేత్త ఆంథోనీ ఫౌచీపై విరుచుకుప‌డ్డారు.  మ‌రింత స‌మాచారం కోసం..

13. భారత సైన్యంలో కొత్త టెన్షన్‌ మొదలు