శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 18:12:53

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్


తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌గా, తెలంగాణ సాంస్కృతిక వైభ‌వానికి చిహ్నంగా నిలుస్తున్న బ‌తుక‌మ్మ పండుగ‌ను ప్ర‌జ‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మ‌రింత స‌మాచారం కోసం..

2. మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. ఛార్జీల్లో 40 శాతం రాయితీ


ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభవార్త వినిపించింది. ప్ర‌యాణికుల‌కు ఛార్జీల్లో రాయితీలు ప్ర‌క‌టించింది మెట్రో. మెట్రో సువ‌ర్ణ ఆఫ‌ర్ కింద ప్ర‌యాణాల్లో 40 శాతం రాయితీ క‌ల్పిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్ర‌క‌టించారు. మ‌రింత స‌మాచారం కోసం..

3. సీఎం స‌హాయ‌నిధికి జీహెచ్ఎంసీ పాల‌క‌వ‌ర్గం విరాళం


ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి నెల వేత‌నం విరాళం ఇవ్వాల‌ని జీహెచ్ఎంసీ పాల‌క వ‌ర్గం నిర్ణ‌యించింది. జీహెచ్ఎంసీలో స‌హాయ చ‌ర్య‌ల నిమిత్తం విరాళం ఇవ్వాల‌ని.. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు, కో ఆప్ష‌న్ స‌భ్యులు నిర్ణ‌యించారు. మ‌రింత స‌మాచారం కోసం..

4. ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్‌, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ


భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో చాలాకాలనీల్లో వరద నీరు నిలిచింది. దీంతో పైపులైన్ల లీకై వరద నీరు సంపుల్లోకి, ట్యాంకుల్లోకి చేరి నీరు అపరిశుభ్రమై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మ‌రింత స‌మాచారం కోసం..

5. హైద‌రాబాద్ - బెంగ‌ళూరు హైవే పున‌రుద్ధ‌ర‌ణ‌


భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద 44వ జాతీయ ర‌హ‌దారి పూర్తిగా దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో ఆ రోడ్డుకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. శుక్ర‌వారం ఉద‌యం నుంచి హైద‌రాబాద్ - బెంగ‌ళూరు హైవేపై రాక‌పోక‌ల‌ను పున‌రుద్ధ‌రించారు. మ‌రింత స‌మాచారం కోసం..

6. రెమ్‌డిసివిర్‌తో మ‌ర‌ణాలు ఆగ‌లేదు : డ‌బ్ల్యూహెచ్‌వో


అమెరికాలో క‌రోనా వైర‌స్ సోకిన వారి కోలుకునేందుకు  రెడ్‌డిసివిర్ వాడుతున్న విష‌యం తెలిసిందే. ఇండియాలో కూడా ఈ డ్ర‌గ్‌ను కోవిడ్ పేషెంట్ల‌కు ఇస్తున్నారు. అయితే గిలీడ్ సంస్థ‌కు చెందిన‌ రెమ్‌డిసివిర్‌.. కోవిడ్ పేషెంట్ల‌పై పెద్ద‌గా ప్ర‌భావం ఏమీ చూప‌లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. మ‌రింత స‌మాచారం కోసం..

7. స‌ముద్రంలోకి ఫుకుషిమా రేడియోధార్మిక నీరు !


ఫుకుషియా అణు రియాక్ట‌ర్‌లోని రేడియోధార్మిక నీటిని స‌ముద్రంలోకి వ‌ద‌ల‌నున్నారు.  2011లో వ‌చ్చిన భూకంపం వ‌ల్ల ఫుకుషిమా న్యూక్లియ‌ర్ ప్లాంట్ ధ్వంసం అయిన విష‌యం తెలిసిందే. మ‌రింత స‌మాచారం కోసం..

 8. గ్యాస్‌ సిలిండర్‌ సరఫరాకు ఓటీపీ తప్పనిసరి


ఇకపై వంట గ్యాస్‌ సిలిండర్‌ను ఇంటికి సరఫరా చేసేందుకు ఓటీపీ లేదా ఒకసారి వినియోగించే పాస్‌వర్డ్‌ తప్పనిసరి. నవంబర్‌ నెల నుంచి కొత్త రూల్‌ అమలులోకి రానున్నది.మ‌రింత స‌మాచారం కోసం..

 9. 17 ర‌కాల బ‌ల‌వ‌ర్ధ‌క పంట‌ వెరైటీలు ఇవే..


పోష‌కాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు భార‌త ప్ర‌భుత్వ కొత్త ర‌కం వంగ‌డాల‌ను రిలీజ్ చేసింది.  గోధుమ‌, వ‌రి, మొక్క జొన్న‌, మినుములు, వేరుశ‌న‌గ పంట‌ల‌కు సంబంధించిన వెరైటీల‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ జాతికి అంకితం చేశారు.మ‌రింత స‌మాచారం కోసం..

10. ఎఫ్ఏవోలో భార‌త్‌ పాత్ర చ‌రిత్రాత్మ‌కం : ప‌్ర‌ధాని మోదీ


వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి బ‌హుమ‌తి ద‌క్క‌డం గొప్ప విష‌య‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.  వ‌ర‌ల్డ్ ఫుడ్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఇవాళ మాట్లాడుతూ.. ఆహార స‌ర‌ఫ‌రా విష‌యంలో భార‌త పాత్ర‌, భాగ‌స్వామ్యం చ‌రిత్రాత్మ‌క‌మైంద‌న్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

11. భార‌త్ క‌న్నా పాక్‌, ఆఫ్ఘ‌న్ బెట‌ర్ : రాహుల్ గాంధీ


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై ఫైర్ అయ్యారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌లో భార‌త్ క‌న్నా పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ దేశాలు బెట‌ర్‌గా ప‌నిచేశాయ‌న్నారు.  ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేసిన రాహుల్ గాంధీ..మ‌రింత స‌మాచారం కోసం..

12. శౌర్య‌చ‌క్ర విజేత బ‌ల్వింద‌ర్ సింగ్ కాల్చివేత‌..


శౌర్య‌చ‌క్ర అవార్డు గెలిచిన బ‌ల్వింద‌ర్ సింగ్ భిక్విండ్‌ను ఇవాళ గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు వ్య‌క్తులు కాల్చి చంపారు.  బ‌ల్వింద‌ర్ వ‌య‌సు 63 ఏళ్లు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని త‌ర్న్ తార‌న్‌లో జ‌రిగింది. మ‌రింత స‌మాచారం కోసం..

13. యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ అరుదైన రికార్డు


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విధ్వంసకర ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ అరుదైన ఘనత సాధించాడు.  ఐపీఎల్‌లో 4500 పరుగులు సాధించిన ఎనిమిదో ఆటగాడిగా గేల్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.మ‌రింత స‌మాచారం కోసం..

14. కోల్‌కతా కెప్టెన్‌గా ఇయాన్‌ మోర్గాన్‌