బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 18:09:56

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. తెలంగాణ‌పై కొన‌సాగుతున్న వాయుగుండం


తెలంగాణ‌పై వాయుగుండం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో రెండు, మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.  మ‌రింత స‌మాచారం కోసం..

2. వ‌ర్షాల కార‌ణంగా ఇవాళ‌, రేపు సెల‌వులు


గ‌త రెండు రోజుల నుంచి కురుస్తున్న కుండ‌పోత వాన‌ల‌కు తెలంగాణ త‌డిసి ముద్దైంది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాష్ర్ట ప్ర‌భుత్వం ఇవాళ‌, రేపు సెల‌వులు ప్ర‌క‌టించింది. అత్య‌వ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.మ‌రింత స‌మాచారం కోసం..

3. రాబోయే రెండు రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండండి : కేటీఆర్


హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. ముంపు బాధితుల స‌మ‌స్య‌ల‌ను కేటీఆర్ ఓపిక‌గా అడిగి తెలుసుకుంటున్నారు. ముసారాంబాగ్‌లోని స‌లీంన‌గ‌ర్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం కేటీఆర్ ప‌ర్య‌టించి.. బాధితుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

4. హైద‌రాబాద్‌లో 1903 త‌ర్వాత ఇదే భారీ వాన 


హైద‌రాబాద్‌లో ఇలాంటి వాన ఎన్న‌డూ చూడలేదు.  మేఘాలు ఊడిప‌డ్డ తీరు ఈ కాలంలో ఎన్న‌డూ చోటుచేసుకోలేదు.  గ‌త రెండు రోజులు‌గా కురిసిన వాన‌ల‌కు.. పాత రికార్డుల‌న్నీ బ్రేక్ అయ్యాయి. మ‌రింత స‌మాచారం కోసం.. 

5. 'బెంగ‌ళూరు వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లండి'


న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద 44వ జాతీయ‌ర‌హ‌దారిపై వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వాన‌ల‌తో హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి కోత‌కు గుర‌య్యింది.మ‌రింత స‌మాచారం కోసం..

6. ఆ నాలుగు బిల్లుల‌కు శాస‌న‌మండ‌లి ఆమోదం


తెలంగాణ శాస‌న‌మండ‌లి ఆ నాలుగు బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను మండ‌లిలో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బిల్లులపై చ‌ర్చించి.. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం ఈ నాలుగు బిల్లుల‌ను ఆమోదిస్తున్న‌ట్లు చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. మ‌రింత స‌మాచారం కోసం..

7. హుస్సేన్ సాగ‌ర్ నాలుగు గేట్లు ఎత్తివేత‌.. వీడియో


కుండ‌పోత వాన‌ల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం అత‌లాకుత‌లం అవుతోంది. న‌గ‌ర ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. హుస్సేన్ సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద పోటెత్తింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

8. శోభానాయుడు మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం


ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ డా.శోభా నాయుడు ఇవాళ‌ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మృతి ప‌ట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.  మ‌రింత స‌మాచారం కోసం..

9. ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గితే.. కరోనా సోకినట్లే


రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గితే కరోనా సోకినట్లుగా అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను ప్రమాణంగా తీసుకుని ఆ మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.మ‌రింత స‌మాచారం కోసం..

10. కాంగ్రెస్ లో చేరిన శరద్ యాదవ్ కుమార్తె....


లోక్ తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్ రావు బుధవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సుభాషిణి రాజ్ రావు ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. మ‌రింత స‌మాచారం కోసం..

11. ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత


దేశ రాజధానిలో గాలి నాణ్యత మరింత దిగజారింది. మంగళవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) ప్రకారం.. ఢిల్లీలోని ఏటీఓ, ఆనంద్‌ విహార్‌, రోహిణిలో 263, నెహ్రూనగర్‌లో 229 గాలి నాణ్యత సూచీ నమోదైందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తెలిపింది.మ‌రింత స‌మాచారం కోసం..

12. ఈ నెల 17 నుంచి శ‌తాబ్ది రైళ్లు ప్రారంభం


ఈ నెల 17 వ తేదీ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మెట్రో నగరాలు, పర్యాటక ప్రాంతాలకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తాయి.మ‌రింత స‌మాచారం కోసం..

13. ఢీకొన్న సైనిక హెలికాప్ట‌ర్లు.. 15 మంది మృతి


ఆఫ్ఘ‌నిస్తాన్‌లో రెండు వైమానిక ద‌ళ హెలికాప్ట‌ర్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న హెల్మండ్ ప్రావిన్సులోని న‌వా జిల్లాలో జ‌రిగింది.  మంగ‌ళ‌వారం రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 15 మంది మ‌ర‌ణించారు.మ‌రింత స‌మాచారం కోసం..

14. 2014 తర్వాత తొలిసారి డకౌట్..ఆ బ్యాట్స్‌మన్‌ ఎవరంటే?‌


ఐపీఎల్‌లో గత కొన్నేండ్లుగా మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని  చెన్నై  సూపర్‌ కింగ్స్‌ సాధించిన  విజయాల్లో   స్టార్‌ బ్యాట్స్‌మన్‌  డుప్లెసిస్‌ పాత్ర ఎంతో ఉంది.  బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే డుప్లెసిస్‌..అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలతో  కళ్లు చెదిరే క్యాచ్‌లను అందుకున్నాడు.  మ‌రింత స‌మాచారం కోసం..

15. నేను 20 కిలోలు బ‌రువు పెరిగా: ట‌్విట‌ర్ లో క‌ంగ‌నా