సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 18:58:04

టుడే న్యూస్ హైలైట్స్..‌

టుడే న్యూస్ హైలైట్స్..‌

1. అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌: రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించిన ఆయ‌న‌.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో  ఆదివారం భారీ వర్షాలు కురిశాయని, సోమ, మంగళవారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని గుర్తుచేశారు. మ‌రింత స‌మాచారం కోసం..


2. ఆడపిల్లను కాపాడండి, చదివించండి పోస్టర్ ఆవిష్కరణ


హైదరాబాద్: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లను చదివించండి అనే పోస్టర్ ను గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలోని జిల్లా మహిళా సంక్షేమ అధికారి స్వాతి, జిల్లా శిశు పరిరక్షణ అధికారి విష్ణు వందన, జిల్లా చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ లతో కలిసి ఆవిష్కరించారు. మ‌రింత స‌మాచారం కోసం.. 


3. ఈ తాత పాట వింటే మీరు ఫిదా..!


ఈ తాతకు సీఎం కేసీఆర్‌ అంటే ఇష్టం.. టీఆర్‌ఎస్‌ అంటే ప్రాణం..అందుకే ‘కారు గుర్తు’పై మంచి పాటగట్టిండు..తెలంగాణ వచ్చినంక జరిగిన అభివృద్ధిని పాటరూపంలో వినిపించిండు. ఆయన పాట పాడుతుంటే నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. మరెందుకాలస్యం ఈ కింద ఉన్న వీడియోను మీరూ చూసేయండి. మ‌రింత స‌మాచారం కోసం..


4. మూడో విడుతకు భారత్‌ బయోటెక్‌ సిద్ధం


హైదరాబాద్: భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవ్యాగ్జిన్‌ మూడోదశ మానవ ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఫేజ్‌-2 ట్రయల్స్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను తమకు అందించాలని ప్రయోగ సంస్థలు/దవాఖానలకు సూచించింది. భద్రత, వ్యాక్సిన్‌ సామర్థ్యం వంటి అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. మ‌రింత స‌మాచారం కోసం..


5. ఆడ బిడ్డలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరెలు


వరంగల్ అర్బన్ : తెలంగాణ ఆడ బిడ్డలకు పండుగ కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందజేస్తున్నారన్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ పరిధిలో గల వడ్డేపల్లి పార్క్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులతో కలిసి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. మ‌రింత స‌మాచారం కోసం


6. దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు


న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య 70లక్షలు దాటింది. నిత్యం 50వేల నుంచి 70వేలకుపైగా పాజిటివ్‌ కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 74,383 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. మ‌రింత స‌మాచారం కోసం..


7. శీతాకాలంలో మరింతగా కరోనా కేసులు


న్యూఢిల్లీ: కరోనా కేసులు శీతాకాలంలో మరింతగా పెరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా పలు నివేదికలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా దీన్ని తోసిపుచ్చలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ప్రజలంతా మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని హర్ష వర్ధన్ సూచించారు. మ‌రింత స‌మాచారం కోసం..


8. పాక్‌కు చైనా ‘క్షిపణి’ సాయం.. నిజం కాదు!


శ్రీనగర్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో పాకిస్థాన్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించడానికి చైనా సహాయం చేస్తున్నట్టు ఎలాంటి అధారాలు లేవని ఆర్మీ టాప్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు చెప్పారు. అయితే యుద్ధ సామగ్రి విషయంలో ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకుంటున్నాయని తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం..


9. నయా బానిసత్వంలో స్త్రీ!


ఐరాస: ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్ల మంది బాలికలు, మహిళలు బానిసత్వం, వెట్టిచాకిరీ, బలవంతపు వివాహాలు, భర్తల నుంచి వేధింపులు తదితర సమస్యల వలయంలో చిక్కుకున్నారని ఓ నివేదిక వెల్లడించింది. బానిసత్వ నిర్మూలన కోసం ఏర్పడ్డ వాక్‌ ఫ్రీ అనే స్వచ్ఛందసంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), అంతర్జాతీయ వలస కార్మికుల సంస్థ సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. మ‌రింత స‌మాచారం కోసం..


10. థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం.. 17 మంది దుర్మరణం


బ్యాంకాక్‌: ధాయిలాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 17 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా  29 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందు వెళ్తుండగా ఉదయం 8 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రావిన్స్‌ గవర్నర్‌ మైత్రీ త్రితిలానంద్‌ తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం..


11. పొలాండ్‌ భామ ఫ్రెంచ్‌ కిస్‌


19 ఏండ్ల అమ్మాయి.. ప్రపంచ 54వ ర్యాంకర్‌..  అసలు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కైనా చేరుతుందని ఎవరూ అంచనా వేయలేదు.. అలాంటిది ఇగా స్వియాటెక్‌  చరిత్ర సృష్టించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకొని గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన తొలి పొలాండ్‌ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. మ‌రింత స‌మాచారం కోసం..


12. 2050 నాటికి అతి‌పెద్ద ఆర్థిక వ్యవ‌స్థగా భారత్