సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 18:04:55

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. సీఎం కేసీఆర్ ఆస్తులు ఆన్‌లైన్‌లో న‌మోదు


ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కుటుంబ ఆస్తి వివ‌రాలు ఆన్‌లైన్‌లో న‌మోదు అయ్యాయి. మ‌ర్కుక్ మండ‌లంలోని ఎర్ర‌వ‌ల్లిలోని త‌న నివాస గృహానికి వ‌చ్చిన‌ గ్రామ కార్య‌ద‌ర్శి సిద్దేశ్వ‌ర్‌కు సాధార‌ణ పౌరుడి మాదిరిగానే సీఎం కేసీఆర్‌ త‌న కుటుంబం ఆస్తుల వివ‌రాల‌ను తెలియ‌జేశారు. మ‌రింత స‌మాచారం కోసం..

2. యువకులే టీఆర్ఎస్ సైనికులు : హ‌రీష్ రావు


యువ‌కులే టీఆర్ఎస్ పార్టీ సైనికులు అని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆనాజ్‌పూర్‌, తిమ్మ‌క్క‌ప‌ల్లి గ్రామాల‌కు చెందిన బీజేపీ యువ‌కులు హ‌రీష్ రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా యువ‌కులంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి హ‌రీష్‌రావు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. మ‌రింత స‌మాచారం కోసం..

3. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!


రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం శనివారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. మ‌రింత స‌మాచారం కోసం..

4. దిశ సినిమాను బ్యాన్‌ చేయాలి : దిశ తండ్రి


దిశ సంఘటన నేపథ్యంలో సినిమా తీయడాన్ని దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి ఖండించారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ కోర్టులో సినిమాను బ్యాన్‌ చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా వర్మ సినిమా తీయడం తగదన్నారు. మ‌రింత స‌మాచారం కోసం..

5. 60,000 మంది సైనికుల్ని మోహ‌రించిన చైనా..


భార‌త స‌రిహ‌ద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహ‌రించిన‌ట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో వెల్ల‌డించారు.  ఇటీవ‌ల భార‌త్‌, చైనా మ‌ధ్య ల‌డాఖ్‌లో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన విష‌యం తెలిసిందే.మ‌రింత స‌మాచారం కోసం..

6. పాక్‌ నుంచి ఆయుధాలు స‌ర‌ఫ‌రా.. ప‌ట్టుకున్న భార‌త ఆర్మీ


ఉత్త‌ర క‌శ్మీర్‌లోని కీర‌న్ సెక్టార్‌లో భార‌తీయ ఆర్మీ .. పాకిస్థాన్ నుంచి అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా అవుతున్న ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్న‌ది. పాకిస్థాన్ ఆర్మీ సాయంతో పీవోకే‌లో ఉగ్ర‌వాదులు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న త‌రుణంలో భార‌త ఆర్మీ  ప‌ట్టుకున్న‌ది. మ‌రింత స‌మాచారం కోసం..

7. భారత్‌లోనే సంతృప్తికర ముస్లింలు అధికం : మోహన్‌ భగవత్‌


ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో ఎక్కువ సంతృప్తికర ముస్లింలు ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, స్వలాభం ప్రభావితమయ్యే వ్యక్తుల ద్వారా మూర్ఖత్వం, వేర్పాటువాదం వ్యాప్తి చెందుతున్నదని ఆయన నొక్కి చెప్పారు.మ‌రింత స‌మాచారం కోసం..

8. ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య రెండ‌వ డిబేట్ ర‌ద్దు..


అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌,  డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన రెండ‌వ డిబేట్ ర‌ద్దు అయ్యింది.  అక్టోబ‌ర్ 15వ తేదీన జ‌ర‌గాల్సిన ఆ చ‌ర్చ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు క‌మిష‌న్ ఆన్ ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.మ‌రింత స‌మాచారం కోసం..

9. మోదీకి వీఐపీ ప్లేన్‌.. జ‌వాన్ల‌కు నాన్-బుల్లెట్ ప్రూఫ్ ట్ర‌క్కులా ?


మోదీ స‌ర్కార్ వీవీఐపీ హెలికాప్ట‌ర్‌ను ఖ‌రీదు చేసిన విష‌యం తెలిసిందే.  అయితే దీనిపై ఇవాళ రాహుల్ గాంధీ మ‌రోసారి ఫైర్ అయ్యారు. మ‌న జ‌వాన్లను నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్ర‌క్కుల్లో యుద్ధానికి పంపుతున్నారు, కానీ ప్ర‌ధాని మోదీ మాత్రం 8400 కోట్ల‌తో ప్ర‌త్యేక బుల్లెట్ ప్రూఫ్ విమానం తెప్పించుకున్న‌ట్లు ఆరోపించారు. మ‌రింత స‌మాచారం కోసం..

10. 18 ఏళ్ల యువ‌కుడిని బ‌లిగొన్న 'ప్రేమ‌'


దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర జ‌రిగింది. ఇద్ద‌రి మ‌ధ్య విర‌బూసిన ప్రేమ‌.. ఓ 18 ఏళ్ల యువ‌కుడిని ప్రాణాల‌ను బ‌లిగొన్న‌ది. ఆద‌ర్శ్‌న‌గ‌ర్‌కు చెందిన రాహుల్ రాజ్‌పుత్‌(18) డిస్టెన్స్‌లో విద్య‌ను అభ్య‌సిస్తూ.. ఇంటి వ‌ద్ద పిల్ల‌ల‌కు ఇంగ్లీష్ ట్యూష‌న్ చెబుతున్నాడు.మ‌రింత స‌మాచారం కోసం..

11. టీచ‌ర్ పాఠం చెబుతుంటే బ‌య‌ట‌ప‌డ్డ‌ యువ‌కుడి అకృత్యాలు


గుజ‌రాత్ రాష్ట్రం వ‌డోద‌ర జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ యువ‌కుడు చాక్‌లెట్స్ ఆశ పెట్టి ముగ్గురు బాలిక‌లపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అయితే, ఈ విష‌యం విచిత్రంగా ఓ స్కూల్‌లో టీచ‌ర్ పాఠాలు బోధిస్తుండ‌గా బ‌య‌ట‌ప‌డింది. మ‌రింత స‌మాచారం కోసం..

12. KXIP vs KKR: గిల్‌, కార్తీక్‌ మెరుపులు..