శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 18:19:41

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప‌ ఎన్నిక‌.. 99.63 శాతం పోలింగ్‌ 


నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల్లో 99.63 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. మ‌రింత స‌మాచారం కోసం..

2. రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు రాష్ర్ట మంత్రివ‌ర్గ స‌మావేశం


ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌కు రాష్ర్ట మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేబినెట్ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టాల్సిన చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లుల‌ను ఆమోదించే అవ‌కాశం ఉంది.మ‌రింత స‌మాచారం కోసం..

3. ఈ నెల‌ 13, 14 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ


ఈ నెల 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్నారు. 13న ఉద‌యం 11:30 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. 14న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌మండ‌లి ప్రారంభం కానుంది. మ‌రింత స‌మాచారం కోసం..

4. దుబ్బాక‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌


దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. రోజురోజుకు ఆ పార్టీ బ‌ల‌హీన‌ప‌డి పోతోంది. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు న‌ర్సింహారెడ్డి, మ‌నోహ‌ర్ రావులు మంత్రి హ‌రీష్ రావు స‌మ‌క్షంలో గులాబీ గూటికి చేరారు.మ‌రింత స‌మాచారం కోసం..

5. సమ్మక్క, సారలమ్మలకు బతుకమ్మ సారె


ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క, సారమ్మ వనదేవతలకు మొదటి బతుకమ్మ సారెను సమర్పించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గిరిజన, స్ర్తీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ఎంపీ కవితతో కలిసి అమ్మవార్లకు సమర్పించి నూతన ఒరవడికి నాంది పలికారు.మ‌రింత స‌మాచారం కోసం..

6. వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి


నోబెల్ క‌మిటీ ఇవాళ శాంతి బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్ శాంతి పుర‌స్కారం ద‌క్కింది. అంత‌ర్ యుద్ధంతో ర‌గులుతున్న ప్రాంతాల్లో శాంతి నెల‌కొల్పేందుకు వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎంతో దోహ‌ద‌ప‌డిన‌ట్లు నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది.  యుద్ధ ప్రాంతాల్లో ఆక‌లిని ఆయుధంగా మార్చుకుని శాంతిని స్థాపించిన‌ట్లు క‌మిటీ చెప్పింది.  మ‌రింత స‌మాచారం కోసం..

7. 'అధ్యక్షుడిగా బైడెన్‌ 2 నెల‌లు కంటే ఎక్కువుండడు'


రాబోయే ఎన్నిక‌ల్లో ఒక‌వేళ బైడెన్ గెలిస్తే, అప్పుడు క‌మ్యూనిస్టు క‌మ‌లా హారిస్ నెల‌లోపే ప‌గ్గాల‌ను త‌న చేతుల్లోకి తీసుకుంటుంద‌ని ట్రంప్ ఆరోపించారు.  క‌మ‌లా క‌మ్యూనిస్టు అని, ఆమె సోష‌లిస్టు కాదు అని, ఆమె అభిప్రాయాల‌ను ఓసారి ప‌రిశీలించండి, స‌రిహ‌ద్దుల్ని ఓపెన్ చేసి.. హంత‌కుల‌ను, రేపిస్టుల‌ను దేశంలోకి ఆహ్వానించాల‌నుకున్న‌ద‌ని ట్రంప్ ఆరోపించారు.మ‌రింత స‌మాచారం కోసం..

8. భార్య త‌ల న‌రికి పోలీసు స్టేష‌న్‌కు తీసుకెళ్లిన భ‌ర్త‌


ఓ భ‌ర్త క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. త‌న భార్య‌పై అనుమానం పెంచుకున్న భ‌ర్త ఆమె త‌లను న‌రికేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బందా జిల్లాలోని నీతాన‌గ‌ర్‌లో శుక్ర‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.మ‌రింత స‌మాచారం కోసం..

9. రాజ‌స్థాన్‌లో దారుణం.. అర్చ‌కుడి స‌జీవ ద‌హ‌నం


రాజ‌స్థాన్ రాష్ట్రం క‌రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జ‌రిగింది. గ్రామంలోని రాధాకృష్ణ ఆల‌యంలో అర్చ‌కుడిగా ప‌నిచేస్తున్న బాబూలాల్ వైష్ణ‌వ్‌పై అత‌ని ప్ర‌త్య‌ర్థులు బుధ‌వారం మ‌ధ్యాహ్నం దారుణానికి పాల్ప‌డ్డారు. అత‌నిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.  మ‌రింత స‌మాచారం కోసం..

10. వ‌డ్డీ రేట్లు య‌ధాత‌థం.. జీడీపీ అంచ‌నా -9.5 శాతం


గృహ‌, ఆటో రుణాలు తీసుకునేవారికి  ఇది చేదువార్తే.  ఆర్బీఐ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌లేదు.  వ‌డ్డీ రేట‌ను య‌ధావిధిగా 4 శాతం వ‌ద్దే ఉంచింది.  ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్ష వివ‌రాల‌ను ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ వెల్ల‌డించారు. మ‌రింత స‌మాచారం కోసం..

11. వార్నర్‌ యూట్యూబ్‌ ఛానల్‌.. యువరాజ్‌ సెటైర్లు


ఆస్ట్రేలియా ఓపెనర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు.  ఈ విషయాన్ని వార్నర్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. వార్నర్‌ ట్వీట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వ్యంగ్యంగా స్పందించాడు. 'ఇందులో నీ డాన్స్‌ వీడియోలు(టిక్‌టాక్‌  లాంటి) తప్పక  ఉంటాయని ఆశిస్తున్నా' అంటూ యువీ సరదాగా  కామెంట్‌ చేశాడు. మ‌రింత స‌మాచారం కోసం..

12. ల‌క్ష్మీదేవిని ఆరాధిస్తున్న హాలీవుడ్ న‌టి