ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 18:12:13

టుడే న్యూస్ హైలెట్స్..

టుడే న్యూస్ హైలెట్స్..

1. ఆరోగ్య శ్రీలోకి కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌!


ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి కిడ్నీ, హార్ట్, లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌ను తీసుకురావాల‌ని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం నిర్ణ‌యం తీసుకుంద‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు రూ. 30 ల‌క్ష‌ల నుంచి రూ. 40 ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంద‌ని ఇది పేద‌ల‌కు భారంగా మారింద‌న్నారు. ఈ క్ర‌మంలో ఈ మూడింటిని ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి చేర్చి.. పేద‌ల‌పై రూపాయి భారం ప‌డ‌కుండా ఉచిత వైద్యం అందిస్తామ‌న్నారు. మ‌రింత స‌మాచారం కోసం..

2. ఈనెల 12, 13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ!


ఈ నెల 12, 13వ తేదీల్లో అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వ‌హించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం యోచిస్తోంది. జీహెచ్ఎంసీ చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు, హైకోర్టు సూచించిన అంశాల్లో చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ల కోసం అసెంబ్లీని స‌మావేశ ప‌ర్చాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రింత స‌మాచారం కోసం..

3. జీవో నం. 46 ఉల్లంఘ‌న‌.. స్కూళ్ల‌పై విచార‌ణ‌


కరోనా నేప‌థ్యంలో తెలంగాణ‌లోని ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు ఫీజులు పెంచొద్ద‌ని ప్ర‌భుత్వం జీవో నం. 46ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కానీ కొన్ని ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు ఈ జీవో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించాయి. జీవో నం. 46 నిబంధ‌న‌లు ఉల్లంఘించిన స్కూళ్ల‌పై విచార‌ణ జ‌రిపేందుకు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకుంది.మ‌రింత స‌మాచారం కోసం..

4. స్పుత్నిక్ ట్ర‌య‌ల్స్‌.. డాక్ట‌ర్ రెడ్డీస్ ప్ర‌తిపాద‌న‌ తిర‌స్క‌ర‌ణ‌


క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ర‌ష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను భారీ స్థాయిలో నిర్వ‌హించాల‌నుకున్న డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది.  విస్తృత స్థాయిలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను భార‌త డ్ర‌గ్ రెగ్యూలేట‌రీ సంస్థ తిర‌స్క‌రించింది.మ‌రింత స‌మాచారం కోసం..

5. నోబెల్ సాహిత్య విజేత లూయిస్ గ్లూక్‌


ఈ యేటి నోబెల్ సాహిత్య అవార్డు అమెరికా ర‌చ‌యిత లూయిస్ గ్లూక్‌ను వ‌రించింది. త‌న ర‌చ‌న‌ల్లో అద్భుత‌మైన క‌వితా నైపుణ్యాన్ని ఆమె ప్ర‌ద‌ర్శించిన‌ట్లు నోబెల్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. అమెరికాలోని యేల్ యూనివ‌ర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్‌గా చేస్తున్న ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు 12 క‌వితా సంపుటాలు వెలువ‌రించారు.మ‌రింత స‌మాచారం కోసం..

6. క‌రోనా సోక‌డం.. దేవుడి దీవెనే : ట‌్రంప్‌


అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో కొత్త వీడియోను రిలీజ్ చేశారు.   క‌రోనా వైర‌స్ సంక్ర‌మించ‌డాన్ని ఆయ‌న దేవుడి దీవెన‌తో పోల్చారు. వాల్ట‌ర్ రీడ్ మిలిట‌రీ హాస్పిట‌ల్‌లో త‌న‌కు జ‌రిగిన చికిత్స గురించి ట్రంప్ త‌న వీడియో ట్వీట్‌లో వివ‌రించారు. మ‌రింత స‌మాచారం కోసం..

7. రేటింగ్‌ స్కాంలో రిపబ్లిక్‌ టీవీ


టీఆర్పీ రేటింగ్స్‌ స్కామ్‌ గుట్టురట్టు చేసిన ముంబై పోలీసులు. ప్రముఖ చానెల్‌గా వెలుగొందుతున్న రిపబ్లిక్‌ టీవీ యాజమాన్యం రేటింగ్‌ స్కాంకు పాల్పడినట్లుగా ముంబై పోలీసులు ప్రకటించారు.మ‌రింత స‌మాచారం కోసం..

8. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో గ్యాంగ్ రేప్‌.. బాధితురాలి ఆత్మ‌హ‌త్య


ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రో ఘోరం జ‌రిగింది. వివాహ వేడ‌క‌కు హాజ‌రై ఇంటికి తిరిగి వ‌స్తున్న ఓ బాలికను స‌మీప అట‌వీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి ఏడుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఇంటికి వ‌చ్చిన బాధితురాలు అవ‌మానాన్ని భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. మ‌రింత స‌మాచారం కోసం..


9. బాలికతో స్నేహంపై పోలీసులకు హాథ్రస్‌ నిందితుడి లేఖ


ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన హాథ్రస్‌ బాలిక మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. 19 ఏండ్ల దళిత బాలికను అగ్రవర్గాలకు చెందిన యువకులు సెప్టెంబర్‌ 14న సామూహిక లైంగిక దాడి చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సందీప్‌ ఠాకూర్‌ యూపీ పోలీసులకు బుధవారం ఒక లేఖ రాశాడు.మ‌రింత స‌మాచారం కోసం..

10. వార్నర్‌ vs రాహుల్‌.. ఎవరిదో ‘గెలుపు’?


గత మ్యాచ్‌లో   ముంబై ఇండియన్స్‌‌ చేతిలో  ఓటమిపాలైన   సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మరో  ఆసక్తికర పోరుకు సిద్ధమైంది.  డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ దుబాయ్‌ వేదికగా ఇవాళ  కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో  తలపడనుంది. మ‌రింత స‌మాచారం కోసం..

11. ఎమ్మెల్యే కూతురుకు వ‌ర‌క‌ట్న వేధింపులు!


వ‌ర‌క‌ట్న వేధింపులు సామాన్యుల కుటుంబాల్లోనే కాదు పెద్ద‌పెద్ద రాజ‌కీయ నాయ‌కుల కుటుంబాల్లోనూ ఉంటాయ‌ని నిరూపించే ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం షియోపూర్ జిల్లాలో ఏకంగా ఓ ఎమ్మెల్యే కూతురు వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు గుర‌య్యింది.మ‌రింత స‌మాచారం కోసం..

12. చెట్టును న‌రికినందుకు రూ. 25 వేలు జ‌రిమానా


న‌గ‌రంలోని ఎల్బీ న‌గ‌ర్ జోన్ ప‌రిధిలోని ఎఫ్‌సీఐ కాల‌నీలో ఓ వ్య‌క్తి త‌న ఇంటి ముందున్న భారీ వృక్షాన్ని న‌రికి వేయిస్తున్నాడు. దీన్ని సుర‌భి మెట్‌ప‌ల్లి అనే వ్య‌క్తి చిత్రీక‌రించి.. ట్విట్ట‌ర్‌లో రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌ను ఎఫ్‌సీఐ కాల‌నీకి పంపి.. చెట్టు న‌రికి వేయించిన వ్య‌క్తికి రూ. 25 వేలు జరిమానా విధించారు. మ‌రింత స‌మాచారం కోసం..