సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 18:22:36

టుడే న్యూస్‌ హైలెట్స్‌

టుడే న్యూస్‌ హైలెట్స్‌

1. రాష్ట్ర పోలీసుల ప‌ని తీరు అద్భుతం : మంత్రి కేటీఆర్


హైద‌రాబాద్ : గ‌త ఆరేళ్లలో రాష్ర్ట పోలీసుల ప‌నితీరు అద్భుతంగా ఉంద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. శాంతి భ‌ద్రత‌లు, ర‌క్షణ విష‌యంలో న‌గ‌రానికి మంచి పేరు తెచ్చారు అని కొనియాడారు.  మరింత సమాచారం కోసం..

2. ద‌క్షిణ కొరియా పెట్టుబ‌డుల‌కు స్వాగ‌తం : మ‌ంత్రి కేటీఆర్హైద‌రాబాద్ : ఇండియా - కొరియా బిజినెస్ ఫోరం స‌ద‌స్సులో ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ద‌క్షిణ కొరియా పారిశ్రామిక వ‌ర్గాలు, భార‌త్ - కొరియా రాయ‌బారులు, ప‌లు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం..

3. సుర‌క్షిత హైద‌రాబాదే ల‌క్ష్యం : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి


హైద‌రాబాద్ : గ‌చ్చిబౌలిలో ప్రారంభించిన‌ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ హైద‌రాబాద్ ఖ్యాతిని మ‌రింత పెంచుతుంద‌ని రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం సంద‌ర్భంగా డీజీపీ మాట్లాడారు. మరింత సమాచారం కోసం..

4. క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం


హైద‌రాబాద్ : గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీతో క‌లిసి ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. మరింత సమాచారం కోసం..

5. వీర జ‌వాన్ మ‌హేశ్‌కు క‌న్నీటి వీడ్కోలు


నిజామాబాద్ : వీర జ‌వాన్ ర్యాడ‌ మ‌హేశ్‌కు ప్ర‌జ‌లు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. నిజామాబాద్ జిల్లాలోని మ‌హేశ్ స్వగ్రామ‌మైన కోమ‌న్‌ప‌ల్లిలో ఆయ‌న అంత్యక్రియ‌లు జ‌రిగాయి. ప్రభుత్వం త‌ర‌పున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. మరింత సమాచారం కోసం..

6. రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భేటీ


హైద‌రాబాద్ : రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గురువారం స‌మావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల‌కు ఆహ్వానం అందింది. మరింత సమాచారం కోసం..

7. స్పుత్నిక్ వ్యాక్సిన్ 92 శాతం ప్రభావ‌వంతం..హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నియంత్రణ కోసం స్పుత్నిక్ టీకాను ర‌ష్యా అభివృద్ధి చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే  ఆదేశం ఆ టీకాను మార్కెట్లోకి కూడా విడుద‌ల చేసింది.  అయితే...మరింత సమాచారం కోసం..

8. పెద్ద పులి దాడిలో ఆసిఫాబాద్ యువ‌కుడు మృతి


కుమ్రం భీం ఆసిఫాబాద్ : ‌జిల్లాలోని ద‌హేగాం మండ‌లంలోని దిగెడ గ్రామంలో పెద్ద పులి బీభ‌త్సం సృష్టించింది. దిగెడ గ్రామ స‌మీపంలో ప‌శువుల‌ను మేపుతున్న గ‌ణేశ్‌(22)పై పెద్దపులి దాడి చేసింది. మరింత సమాచారం కోసం..

9. వేధిస్తున్నద‌ని వ‌దిన గొంతు పిసికి చంపిన మ‌రిది


న్యూఢిల్లీ: ఢిల్లీలోని క‌ర‌వాల్ ఏరియాలో దారుణం జ‌రిగింది. క‌లిసుందామ‌ని వేధిస్తున్నదంటూ ఓ మ‌రిది త‌న‌ వ‌దిన గొంతు పిసికి చంపేశాడు. అనంత‌రం పోలీస్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు.మరింత సమాచారం కోసం..

10. బ‌హ్రెయిన్‌ ప్రధాని షేక్ ఖ‌లీఫా క‌న్నుమూత‌


హైద‌రాబాద్‌:  బ‌హ్రెయిన్ ప్రధాన‌మంత్రి షేక్ ఖ‌లిఫా బిన్ స‌ల్మాన్ అల్ ఖ‌లిఫా మృతిచెందిన‌ట్లు ఆ దేశ రాజ‌భ‌వ‌నం త‌న ట్విట్టర్‌లో వెల్లడించింది.  ఆయ‌న వ‌య‌సు 84 ఏళ్లు. బుధ‌వారం ఉద‌యం అమెరికాలోని మ‌యో క్లీనిక్‌లో షేక్ ఖ‌లీఫా క‌న్నుమూసిన‌ట్లు పేర్కొన్నది. మరింత సమాచారం కోసం..

11. ట్రంప్ అవ‌మానంగా ఫీల‌వుతున్నారు..


హైద‌రాబాద్‌ : వైట్‌హౌజ్ రేసులో ఓడిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న ఓట‌మిని ఇంకా అంగీక‌రించ‌లేదు. దీనిపై 46వ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్ స్పందించారు.  ఎన్నిక‌ల ఓట‌మిని ట్రంప్ అవ‌మానంగా భావిస్తున్నార‌ని.. మరింత సమాచారం కోసం..

12. ఆన్‌లైన్ కంటెంట్‌ను ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది ?


హైద‌రాబాద్‌ : అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఓటీటీ లాంటి ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ వ్యవస్థల‌న్నీ ఇక నుంచి కేంద్ర స‌మాచార, ప్రసార శాఖ ప‌రిధిలోకి రానున్న విష‌యం తెలిసిందే. ఆన్‌లైన్‌లో న్యూస్ విచ్చల‌విడిగా ఉంటున్నట్లు చాలా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మరింత సమాచారం కోసం..

13. పాన్‌గాంగ్ నుంచి మూడు ద‌శ‌ల్లో ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌


హైద‌రాబాద్ ‌: ఇండో-చైనా మ‌ధ్య ఉన్న ప్రతిష్టంభ‌న తొల‌గించేందుకు చేస్తున్న ప్రయ‌త్నాలు ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. ఈస్ట్రన్ ల‌డాఖ్‌లోని పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద నుంచి ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించేందుకు రెండు దేశాలు ఓ ప్రణాళిక‌కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  మరింత సమాచారం కోసం..

14.దీపావ‌ళి త‌ర్వాత సీఎంగా నితీష్ ప్రమాణం!


పాట్నా :  బీహార్ ముఖ్యమంత్రిగా వ‌రుస‌గా ఆరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ‌స్వీకారం చేయ‌నున్నారు. బీహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటిన విష‌యం తెలిసిందే.మరింత సమాచారం కోసం..

15. ఆర్నబ్ గోస్వామికి తాత్కాలిక బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు


న్యూఢిల్లీ: అర్కిటెక్ట్ అన్వయ్ నాయ‌క్‌ను ఆత్మహ‌త్యకు ప్రేరేపించిన ఆరోప‌ణ‌ల‌పై అరెస్టయిన‌ రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఆర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మరింత సమాచారం కోసం..