మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 18:38:11

టుడే న్యూస్ హైలెట్స్‌..

టుడే న్యూస్ హైలెట్స్‌..

1. బ‌డ్జెట్‌పై సీఎం కేసీఆర్ మ‌ధ్యంత‌ర స‌మీక్ష‌


హైదరాబాద్‌: ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న‌ ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, సవరించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. మ‌రింత స‌మాచారం కోసం..

2. 20 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు


జోగులాంబ గ‌ద్వాల: అలంపూర్ జోగులాంబ అమ్మ‌వారిని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ‌నివారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అర్చ‌కులు మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. అనంత‌రం తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేసి ఆశీర్వ‌దించారు. మ‌రింత స‌మాచారం కోసం.. 

3. డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌పై కేటీఆర్ ట్వీట్


హైద‌రాబాద్ : ఒక‌ప్పుడు భాగ్య‌న‌గ‌రంలో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు ప‌రుగెడుతుంటే చూడ‌ముచ్చ‌ట‌గా ఉండేది. నిజాం కాలం‌లో ప్రారంభ‌మైన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు కాల‌క్ర‌మేణా క‌నుమరుగై పోయాయి. అయితే షాకీర్ హుస్సేన్ అనే యువ‌కుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను గుర్తు చేస్తూ ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల గురించి చాలా జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను మ‌ళ్లీ రోడ్ల‌పైకి తీసుకువ‌చ్చేందుకు ఏమైనా అవ‌కాశం ఉందా? అంటూ ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌ను కేటీఆర్ అడిగారు. మ‌రింత స‌మాచారం కోసం..

4. టీఎస్ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో ఒప్పందం


హైద‌రాబాద్: టీఎస్ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఆర్ ఎయిర్ కార్గో & ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (జీఏసీఎఈఎల్‌) డివిజన్‌కు చెందిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ) శనివారం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్‌టీసీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫస్ట్ మైల్ అదేవిధంగా లాస్ట్ మైల్ కార్గో బస్ ఫీడర్ సర్వీస్ (బీఎఫ్ఎస్) ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ ఎగుమతుల‌ను, దిగుమ‌తుల‌ను సంయుక్తంగా ప్రోత్స‌హించ‌నున్నారు. మ‌రింత స‌మాచారం కోసం..

5. జీడిమెట్ల‌లో రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్


హైద‌రాబాద్ : జీడిమెట్ల‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మ‌ల్లారెడ్డితో క‌లిసి శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌కు చెక్ పెట్టేందుకు బల్దియా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో 500 టీపీడీ సామ‌ర్థ్యం క‌లిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. రూ. 10 కోట్ల‌తో క‌న్‌స్ర్ట‌క్ష‌న్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మ‌రింత స‌మాచారం కోసం..

6. నింగికెగిరిన పీఎస్ఎల్వీ సీ49


హైద‌రాబాద్‌: భార‌త అంత‌రిక్ష సంస్థ(ఇస్రో) ఈ ఏడాది తొలి ప్ర‌యోగం నిర్వ‌హించింది.  ఏపీలోని శ్రీహ‌రికోట నుంచి ఇవాళ మ‌ధ్యాహ్నం 3.10 నిమిషాల‌కు పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ నింగికి ఎగిరింది. ఈ రాకెట్‌తో ఈఓఎస్‌-1 శాటిలైట్‌తో పాటు మ‌రో 9 క‌స్ట‌మ‌ర్ శాటిలైట్లు నింగిలోకి దూసుకువెళ్లాయి. పీఎస్ 1 ప‌ర్ఫార్మెన్స్ నార్మ‌ల్‌గా సాగింది. పీఎస్‌2 కూడా నార్మ‌ల్‌గా కొన‌సాగింది. మ‌రింత స‌మాచారం కోసం..

7. ఢిల్లీలో పెరిగిన క‌రోనా కేసులు.. పూర్తిగా నిండిన ఐసీయూ బెడ్‌లు


న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విస్త‌రిస్తున్న‌ది. శుక్ర‌వారం ఒక్క‌రోజే అత్య‌ధికంగా 7,178 కేసులు న‌మోదయ్యాయి. దీంతో న‌గ‌రంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో ఐసీయూ బెడ్‌లు పూర్తిగా నిండిపోయాయి. ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో సైతం ఐసీయూ బెడ్‌లు ఖాళీగా లేవు. విత్ వెంటిలేట‌ర్‌గానీ, వితౌట్ వెంటిలేట‌ర్‌గానీ ఐసీయూ బెడ్‌లు ఖాళీ లేవ‌ని ఆస్ప‌త్రులు చెబుతున్నాయి. మ‌రింత స‌మాచారం కోసం..

8. డిసెంబర్ 1నుంచి బీఎస్ఎన్ఎల్ సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఇవిగో...!


ఢిల్లీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)తమ వినియోగదారుల కోసం సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందించనున్నది. ప్రవేట్ టెలికం ఆపరేటర్లకు ధీటుగా నూతన ఆఫర్లు తీసుకు రానుంది. అందులోభాగంగా రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో డేటా ప్యాక్, టాక్ టైమ్ సహా ఎన్నో ప్రయోజనాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఉన్న రూ.199 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను కూడా రివైజ్ చేసి డేటా రోలోవర్ వంటి అదనపు ప్రయోజనాలు అందించనుందని తెలుస్తున్నది. మ‌రింత స‌మాచారం కోసం.

9. పెన్సిల్వేనియాలో ఆ బ్యాలెట్లను ప‌క్క‌న‌పెట్టాల‌న్న సుప్రీంకోర్టు


హైద‌రాబాద్‌: అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించిన కౌంటింగ్ ప్ర‌క్రియ ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో అమెరికా సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నిక‌ల తేదీ రోజున రాత్రి 8 గంట‌ల త‌ర్వాత వ‌చ్చిన బ్యాలెట్ల‌ను లెక్కించ‌రాదు అని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి సామ్యూల్ అలిటో ఆదేశించారు. మ‌రింత స‌మాచారం కోసం..

10. జపాన్‌ తీరంలో తీవ్ర భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు


టోక్యో : జపాన్‌ రాజధాని టోక్యోకు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలోని ఒగాసవరా ద్వీపంలోని చిచిజిమా తీరాన్ని శనివారం ఉదయం తీవ్ర భూకంపం వణికించింది. రిక్టర్‌ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్‌ వాతావరణ సంస్థ తెలిపింది. సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్లు పేర్కొంది. ఇప్పటివరకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. మ‌రింత స‌మాచారం కోసం..

11. బాట వేసిన డాటా పాలసీ