ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 18:22:20

టుడే న్యూస్‌ హైలెట్స్‌..

టుడే న్యూస్‌ హైలెట్స్‌..

1. మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్యర్థులు ఖ‌రారు


హైదరాబాద్‌ : రాష్ర్ట శాసన‌మండ‌లిలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. .. మరింత సమాచారం కోసం..

2. తెలంగాణ‌ను అగ్ర‌శ్రేణి రాష్టంగా నిలుపుతాం : మ‌ంత్రి కేటీఆర్


హైద‌రాబాద్ : తెలంగాణ‌ను భారత‌‌దేశంలోనే అగ్ర‌శ్రేణి రాష్ర్టంగా నిల‌పాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ని చేస్తున్నారు అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 5 కోట్ల‌తో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.  ..మరింత సమాచారం కోసం..

3. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి : మ‌ంత్రి హ‌రీష్ రావు


హైద‌రాబాద్ : వ‌రి ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి రెండు నాలుక‌ల ధోర‌ణి అవ‌లంభిస్తున్నార‌ని రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు మండిప‌డ్డారు. ధాన్యం మ‌ద్ద‌తు ధ‌ర కంటే రైతుకు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాష్ర్టం నుంచి వ‌రి ధాన్యాన్ని సేక‌రించ‌మ‌ని ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 17న రాష్ర్టాల‌కు కేంద్రం లేఖ రాసిన విష‌యాన్ని హ‌రీష్ రావు గుర్తు చేశారు. .. మరింత సమాచారం కోసం..

4. ప‌టాకుల దుకాణాలు మూసేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశం


హైద‌రాబాద్ : ప‌టాకుల‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పటాకుల అమ్మకాలు, వినియోగాన్నినిషేధించాల‌న్న హైకోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం తాజాగా ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మరింత సమాచారం కోసం..

5. వాసాలమర్రిలో అధికారుల ఇంటింటి సర్వే


యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించారు. గ్రామంలోని 10వార్డుల్లో అధికారులు 10బృందాలుగా ఏర్పడి ఇంటింటా తిరుగుతూ.. .. మరింత సమాచారం కోసం..

6. గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకోండి.. తెలంగాణ‌కు సుప్రీం ఆదేశం


హైద‌రాబాద్‌:  తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ రెండు గంట‌ల పాటు గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. త‌క్కువ స్థాయిలో కాలుష్యం విడుద‌ల చేసే ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన ప‌టాకులు పేల్చేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. . మరింత సమాచారం కోసం..

7. మళ్లీ లెక్కించాలి..


పాట్నా, నవంబర్‌ 12: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులు చెల్లనివిగా ప్రకటించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను మళ్లీ లెక్కించాలని మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ డిమాండ్‌ చేశారు.  .. మరింత సమాచారం కోసం..

8. పాకిస్థాన్ సైన్యం‌ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఎస్ఐ స‌హా ఆరుగురు దుర్మ‌ర‌ణం


న్యూఢిల్లీ: ‌పాకిస్థాన్ సైన్యం మ‌రోసారి బ‌రితెగించింది. జ‌మ్ముకశ్మీర్ రాష్ట్రం బారాముల్లా జిల్లాలోని భార‌త్‌, పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది..  .. మరింత సమాచారం కోసం..

9. అంగ్ సాన్ సూకీకి మోడీ శుభాకాంక్షలు...


ఢిల్లీ : మ‌య‌న్మార్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన అంగ్ సాన్ సూకీ, ఎన్ ఎల్ డి లకు   ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినందుకుగాను అంగ్ సాన్ సూకీ, ఎన్ ఎల్ డికి నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు. .. మరింత సమాచారం కోసం..

10. కడక్‌నాథ్‌ కోళ్లను ఆర్డర్‌ చేసిన ఎంఎస్‌ ధోని.. ఎందుకో తెలుసా.?


భోపాల్‌ : భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని తన ఆర్గానికి పౌల్ట్రీ యూనిట్‌లో ప్రఖ్యాత నల్లజాతి కడక్‌నాథ్‌ కోళ్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన 2 వేల నల్ల కడక్‌నాథ్‌ కోళ్లను తెప్పిస్తున్నారు. .. మరింత సమాచారం కోసం..

11. సాగ‌ర్ రోడ్డుపై ప్ర‌మాదం.. త‌ల్లీకుమారుడు మృతి


రంగారెడ్డి : జిల్లాలోని తుర్క‌యాంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని రాగ‌న్న‌గూడ వ‌ద్ద నాగార్జున సాగ‌ర్ ర‌హ‌దారిపై గురువారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. య‌మ‌హా ఫాసినో బైక్‌పై వెళ్తున్న త‌ల్లీకుమారుడిని వేగంగా వ‌చ్చిన కారు ఢీకొట్టింది. ..మరింత సమాచారం కోసం..

12. నేపాల్‌లో ఘోర ప్ర‌మాదం : 9 మంది మృతి