శనివారం 30 మే 2020
Telangana - Mar 30, 2020 , 06:03:52

నేడు హుస్నాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటన

నేడు హుస్నాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటన

హుస్నాబాద్‌ :  ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ ఈ రోజు హుస్నాబాద్‌ పట్టణంలో పర్యటించనున్నారు. పట్టణంలో కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ ప్రారంభం, కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరా, పారిశుధ్య నిర్వహణ, లాక్‌డౌన్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.  కాలి నడకన స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలను ఎక్కడికక్కడ నిలువరించి వారికి అక్కడే స్థావరాలు ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. కూలీలకు భోజనం వసతి కల్పించిన అధికారులు, వైద్య సిబ్బంది చేత ఆరోగ్య పరీక్షలు నిర్వహింపజేశారు. logo