సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 10:23:57

నేడు వరంగల్‌ నిట్‌ స్నాతకోత్సవం

నేడు వరంగల్‌ నిట్‌ స్నాతకోత్సవం

హైదరాబాద్‌ : వరంగల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) 18వ స్నాతకోత్సవం గురువారం జరుగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి వర్చువల్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. మోషన్‌ క్యాప్చర్‌, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ విధానంతో విద్యార్థుల మోషన్‌ పిక్చర్‌ విధానంలో పట్టాలు స్వీకరించనున్నారు. ఈ విధానంతో విద్యార్థుల రూపంలో ఉన్న యానిమేటెడ్‌ పిక్చర్‌ను పోలిన ఈ-అవతార్‌తో తమ వంతు రాగానే అతిథుల నుంచి పట్టా స్వీకరిస్తారు. ఇందులో విద్యార్థుల ముఖాలను ఆన్‌లైన్‌ మోషన్‌ క్యాప్చర్‌ చేసినట్లు నిట్‌ అధికారులు తెలిపారు. ఏ ధీరమ్స్‌ స్టూడియో స్నాతకోత్సవాన్ని వర్చువల్‌ విధానంలో చేపడుతున్నారు. ఈ ఉత్సవాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఇచ్చిన యూట్యూబ్‌ లింక్‌ ద్వారా, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా వీక్షించవచ్చని అధికారులు పేర్కొన్నారు. కాగా, స్నాతకోత్సవంలో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సైతం వర్చువల్ విధానంలోనే పాల్గొనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 1607 మంది బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను బహూకరించనున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.