ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 00:54:40

పీవీ శతజయంతి ఉత్సవాల లోగో నేడే

పీవీ శతజయంతి ఉత్సవాల లోగో నేడే

  • రవీంద్రభారతిలో ఆవిష్కరించనున్న కమిటీ చైర్మన్‌ కేశవరావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల లోగోను గురువారం ఆవిష్కరించనున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. ఈ లోగోను ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావు ఉదయం 11:30 గంటలకు రవీంద్రభారతిలో ఆవిష్కరించనున్నారు. 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్‌ రూ.10 కోట్లు కేటాయిచండంతోపాటు, పీవీ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు.logo