శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 07:38:17

నేడు సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్ష

నేడు సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్ష

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఆదివారం సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నుంచి 52,924 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం హైదరాబాద్‌లో 99, వరంగల్ మరో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పేపర్‌ -1 జనరల్‌ (స్టడీస్‌), మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో సీశాట్‌ (పేపర్-2‌) పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద వెన్యూ సూపర్‌వైజర్లతోపాటు 99 మంది లోకల్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉండనున్నారు. 34 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. పరీక్షల నిర్వహణపై శనివారం కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. అభ్యర్థుల కోసం పరీక్షా కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మే 31నే పరీక్ష జరగాల్సి ఉండగా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. నెలరోజుల్లోనే పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.