శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:26

వైభవంగా శబరి స్మృతి యాత్ర

వైభవంగా శబరి స్మృతి యాత్ర

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం శబరి స్మృతి యాత్రను వైభవం గా నిర్వహించారు. కొవిడ్‌-19 ఆంక్షల నేపథ్యంలో ఆలయ అర్చక, వైదిక, పరిపాలన సిబ్బంది పర్యవేక్షణలోనే నిరాడంబరంగా సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. తొలుత శబరిమాత విగ్రహంతో రామాలయం నుంచి మేళ తాళాలతో బయలుదేరిన ఆలయ సిబ్బంది.. వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామాలయ పరిసరాల్లో ఉన్న తూము లక్ష్మీనరసింహదాసు, భక్తరామదాసు విగ్రహాలకు, ఆఫీసర్స్‌ క్లబ్‌ సమీపంలోని శబరిమాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆలయ సంప్రదాయం ప్రకారం నూతన వస్ర్తాలు అందించారు. తర్వాత గిరిజనుల తరఫున స్వామి వారికి వివిధ అటవీ ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కూనవరంలో శబరి-గోదావరి సంగమం వద్ద శబరిమాత విగ్రహానికి పంచామృతాభిషేకం, స్నపనం నిర్వహించారు.