గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 13, 2020 , 01:56:54

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం యాదాద్రి క్షేత్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన యాదాద్రి చేరుకోనున్న సీఎం.. తొలుత బాలాలయంలో నారసింహుడిని దర్శించుకొంటారు. అనంతరం యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. సాయం త్రం వైటీడీఏ అధికారులు, ఆలయ ఈవోతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఆలయ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించడం ఇది పదమూడోసారి. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్‌శాఖ భారీ బందోబస్తు చర్యలను చేపట్టింది. కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, డీసీపీ నారాయణరెడ్డి శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.  logo