బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 21:49:16

ఈ రోజు కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు

ఈ రోజు కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: ఈ రోజు కొత్తగా 43 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. చికిత్స పూర్తి చేసుకుని ఒక బాధితుడు ఆస్పత్రి నుంచి డశ్చార్జ్‌ అయ్యాడు. ఇప్పటి వరకు మొత్తం 33 మంది బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ రోజు ఎటువంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం నుంచి మొత్తం 272 కేసులు నమోదు కాగా ప్రస్తుతం అన్ని అస్పత్రుల్లో 228 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్‌ కమ్యునిటీ స్ప్రెడ్‌ జరుగలేదు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు, లేదా వారితో కలిసిన వారు మాత్రమే. మర్కజ్‌ నుంచి వచ్చిన 1090 మందిని గుర్తించి వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అన్ని క్వారంటైన్లలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారు.

 అన్ని సెంటర్లలో ఎన్‌95 మాస్క్‌లు, పీపీఈ కిట్లు, సరిపోయేన్ని అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతీ రోజు ఉదయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వైద్యశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఎంత మంది పాజిటివ్‌ కేసులు వచ్చినా చికిత్స అందించడానికి అన్నీ ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రి మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న ఆరు ల్యాబ్‌లు 24 గంటల పాటు పనిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత మా బాధ్యత, వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 


logo