బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 21:49:40

తెలంగాణలో కొత్తగా 1831 కరోనా‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 1831 కరోనా‌ కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో సోమవారం 1831 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 1419 కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య 27,733కు చేరింది. ఇవాళ 11 మంది వైరస్‌తో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 306కి చేరింది. సోమవారం మరో 2078 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటికీ 14,781 మంది కోలుకున్నారు. మరో 10,646 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ నిర్ధారణ అయిన 1831 కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1417 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్‌ జిల్లాల్లోనే 117 ఉన్నాయి. అలాగే ఖమ్మం జిల్లాలో 21, మంచిర్యాలలో 20, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ అర్బన్‌, పెద్దపల్లి జిల్లాలో 9 చొప్పున, వికారాబాద్‌లో 7, సూర్యాపేటలో 6, కరీంనగర్‌లో 5, జగిత్యాలలో 4, సంగారెడ్డిలో 3, గద్వాల, యాదాద్రి, నారాయణపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.


logo