గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 16:52:15

కరోనా ఎఫెక్ట్‌:ప్రగతిభవన్‌లో హ్యాండ్‌ వాషింగ్‌..

కరోనా ఎఫెక్ట్‌:ప్రగతిభవన్‌లో హ్యాండ్‌ వాషింగ్‌..

హైదరాబాద్‌: వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రగతి భవన్ లో ప్రత్యేక హ్యాండ్ వాషింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రతీ ఇంట్లో, ప్రతీ కార్యాలయంలో కూడా ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లోకి వచ్చే ముందు చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు రెండు పెద్ద గంగాళాళ్లో నీళ్లు నింపి పెట్టారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి  కేసీఆర్ ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు ప్రగతిభవన్‌కు వచ్చారు. logo
>>>>>>