బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 17:57:52

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సినారె ఆడిటోరియం నిర్మించాలి

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సినారె ఆడిటోరియం నిర్మించాలి

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, సినారె వ్యక్తిత్వం ఉట్టిపడేలా డా. సినారె సారస్వత సదనం (ఆడిటోరియం)  నిర్మించాలని, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డా. సీ నారాయణ రెడ్డి  89 వ జయంతిని పురస్కరించుకొని.. ఈనెల 29 న వారి పేరుతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించనున్న ఆడిటోరియం శంకుస్థాపన కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లును, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవిస్తున్నారని తెలిపారు. సినారె సేవలకు గుర్తుగా ఆధునిక హంగులతో గొప్ప ఆడిటోరియాన్ని హైదరాబాద్ నగరం లో నిర్మిoచటానికి హామీనిచ్చారు. 

అందులో భాగంగా ఆడిటోరియం శంకుస్థాపన పనులు, ముందుస్తు ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి  శ్రీనివాస రాజు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.logo